సినిమా రివ్యూ : శ్రీనివాస కళ్యాణం – కుటుంబ ప్రేక్షకుల కోసం..!

Thursday, August 9th, 2018, 03:20:57 PM IST

నితిన్ హీరోగా రాశిఖన్నా హీరోయిన్ గా దిల్ రాజు నిర్మాణంలో శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రం రివ్యూ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం…

స్టోరీ :

సినిమాలో స్టోరీ విషయానికి వస్తే, తన ఉద్యోగ రీత్యా హీరో నితిన్(శ్రీనివాస్) తల్లితండ్రులకు దూరంగా చండీగఢ్ లో జీవిస్తుంటాడు. అయితే అనుకోకుండా హీరోయిన్ రాశిఖన్నా(శ్రీదేవి)ని కలుస్తాడు. కొద్దరిరోజులకి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న సమయంలో హీరోయిన్ తండ్రి అయిన ప్రకాష్ రాజ్ కి, తనకు మధ్య జరిగిన ఒక రహస్య ఒప్పందాన్ని వివాహవేదికలో బయటపెడతాడు హీరో. అయితే వారిద్దరికీ మధ్య జరిగిన ఆ ఒప్పందం ఏమిటి. దానివల్ల ఏమైనా సమస్యలు వచ్చాయా, చివరకు అన్ని సమస్యలు తీరి వారి పెళ్లి ఎలా జరిగింది అనేది మిగతా కథ.

విశ్లేషణ :

శతమానంభవతి చిత్రంతో జాతీయ అవార్డు కైవశం చేసుకున్న సతీష్ వేగేశ్న మరొకసారి హృద్యమైన అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో అతడు కుటుంబాల ప్రాముఖ్యత, పెళ్లి ఎలా జరగాలి, పెళ్లి అనేది ఒక ఫంక్షన్ లా కాకుండా అందరూ బంధువుల మధ్య అంగరంగ వైభవంగా ఒక వేడుకలా జరగాలని చెప్పిన విధానం ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా కొన్ని యూత్ ఫుల్ సన్నివేశాలతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో దర్శకుడు ఎక్కువగా కుటుంబ బంధాలు, అనుబంధాలు, ఎమోషన్స్ పై ఎక్కువగా దృష్టిపెట్టి కథను నడిపించాడు. ఇక హీరో నితిన్, మరియు హీరోయిన్ రాశిఖన్నా జంట తెరపై బాగుంది. సంప్రదాయాలను గౌరవిచే యువకుడిగా నితిన్ బాగా నటించాడు. ఇక రాశి కూడా తన నటనతో సినిమాలో చాల వరకు ట్రెడిషనల్ దుస్తుల్లో ఆకట్టుకుంది. ఇక మిగిలిన పాత్రలైన ప్రకాష్ రాజ్, జయసుధ, సితార, రాజేంద్ర ప్రసాద్, నరేష్ లు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారని చెప్పుకోవాలి. సినిమాలో చిన్నపాత్ర అయినప్పటికీ నందిత శ్వేత తన నటనతో అందరిని అలరించిందనే చెప్పుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

సంప్రదాయాలకు విలువనివ్వడం అనే అంశం బాగుంది

ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్

స్క్రీన్ పై నితిన్-రాశి ఖన్నాల జోడి

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

సాధారణ కథ

తీసుకున్న పాయింట్ మరింత లోతుగా చూపించలేకపోవడం

సెకండ్ హాఫ్ లో యూత్ ఫుల్ అంశాలు లేకపోవడం

తీర్పు :

చివరిగా తెలుగు వారి సంస్కృతి మరియు సంప్రదాయాలకు అద్దంపట్టేలా తెరకెక్కించిన ఈ శ్రీనివాస కళ్యాణం చిత్రం, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే చిన్న చిన్న లోపాలున్నప్పటికీ, మొత్తంగా కుటుంబ సమేతంగా కనుక వెళ్లి చూస్తే అందరికి ఈ చిత్రం తప్పక నచ్చుతుందని, ఓవర్ ఆల్ గా ఇది ఒక ఎబోవ్ యావరేజ్ చిత్రంగా నిలిచే అవకాశం కనపడుతోంది…..

 

Netiap.com Rating : 3 / 5

Reviewed by Netiap Team

Click here for English Review

  •  
  •  
  •  
  •  

Comments