RRR లో ఎన్టీఆర్ లుక్ పై క్లారిటీ..!

Wednesday, December 5th, 2018, 03:14:58 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో, రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మల్టి స్టారర్ RRR విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భారీ కాయంతో కనిపించబోతున్నాడన్న వార్త చాలా కలం నుండి సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా RRR లో ఎన్టీఆర్ లుక్ ఇదేనంటూ ఒక ఫోటో వైరల్ అయ్యింది, అరవింద సమేతలో సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చిన ఎన్టీఆర్ RRR లో వంద కేజీలకు పైగా కనిపించబోతున్నాడు అన్న వార్తకు ఊతమిచ్చేలా ఉంది ఆ ఫోటో. ఆ ఫోటో చూసినవారంతా ఇంత తక్కువ కాలంలో ఎన్టీఆర్ ఇంత బరువెలా పెరిగాడని ఆశ్చర్యపోతున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫీజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఆ ఫోటోపై క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ న్యూ లుక్ అంటూ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఆ ఫోటో ఇప్పటిది కాదని, ఒక సంవత్సరం క్రితం నాటిదని స్పష్టం చేసారు. ఎన్టీఆర్ ప్రస్తుత లుక్ అది కాదని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఖంగారు పడ్డ ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం తోలి షెడ్యూల్ లో భాగంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. ప్రతిష్ట్మాతకంగా రూపొందుతున్న ఈ చిత్రం 2020కి విడుదల కానుంది.

  • 5
  •  
  •  
  •  

Comments