బీజేపీ పార్టీకి ఇదే నా సవాల్ : గంటా శ్రీనివాసరావు.

Monday, September 10th, 2018, 09:25:14 PM IST

ఈ రోజు కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇచ్చిన నిధుల పట్ల, అమరావతి అభివృద్ధి పట్ల శాసన సభ మండలి లో చర్చలు తారా స్థాయిని అంటుకున్నాయి. తెలుగుదేశం మరియు భారతీ జనతా పార్టీ సభ్యుల మధ్య సవాళ్ల వర్షం కురిసింది. కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కు అన్ని రకాల నిధులు ఇచ్చింది అని బీజేపీ నాయకులు మా రాష్ట్రానికి అసలు ఎలాంటి నిధులు ఇవ్వలేదని టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు.

ఈ నేపధ్యం లోనే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరియు మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్యలో సవాళ్లు నడిచాయి. సోము వీర్రాజు ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన నిధులు అన్ని అందించాం అని సరైన వసతులు లేనటువంటి సచివాలయాన్ని నిర్మించిన బాబు తర్వాతి తరాల వారికి ఎలాంటి వసతులు అందిస్తారో చెప్పాలని మాట్లాడుతుండగా టీడీపీ నాయకులు పలువురు అభ్యంతరం వ్యక్తం చేసారు. అదే సమయం లో గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కేంద్రం నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇచ్చినట్టు రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, రాష్ట్రానికి నరేంద్ర మోడీ తీరని అన్యాయం చేసారాని తెలిపారు. ఒకవేళ నిరూపించని పక్షం లో వీర్రాజు గారు ఏం చేస్తారో చెప్పాలని సూచించారు. దీనితో బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ పార్టీని మరియు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కించపరిచినట్టు మాట్లాడుతున్నారని ఆ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

  •  
  •  
  •  
  •  

Comments