టీడీపీ-వైసీపీ నేతల కొట్లాటలతో ముగిసిన యువనేస్తం సభ..!

Tuesday, October 2nd, 2018, 03:49:51 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్కున్నటువంటి నిరుద్యోగ భృతి పథకం “యువనేస్తం”.ఎప్పుడో ప్రకటించిన ఈ పథకాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు.అదే విధంగా అన్ని నియోజక వర్గాల్లోని అక్కడి టీడీపీ ముఖ్య నేతలు,ఎమ్మెల్యేల చేత కూడా సభలను ఏర్పాటు చేసి ఈ యువనేస్తం పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.అదే విధంగా నెల్లూరు లోని మొదలు పెట్టిన యువనేస్తం సభ టీడీపీ మరియు వైసీపీ కార్యకర్తల గొడవలతో ముగిసింది.

ఈ రోజు నెల్లూరు లోని యువనేస్తం కార్యక్రమం ప్రారంభానికి గాను అక్కడి ఆర్దీవో ప్రోటోకాల్ నిమిత్తం కావలి ఎమ్మెల్యే రామి రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఆహ్వానించినట్టు తెలుస్తుంది.అదే సందర్భంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ రావుని కూడా ఆ సభకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది.అప్పుడు ఆ సభలోని భాగంగా ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యువనేస్తం పథకం పట్ల కొన్ని అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు,ఈ యువనేస్తం అనే పథకం మోసపూరితమైనది అని,ఈ పథకం వలన ఆంధ్రప్రదేశ్ యువతకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు.దీనితో అక్కడి టీడీపీ మరియు వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర దుమారం చెలరేగింది,దానితో ఇరు వర్గీయులు ఒకరి మీద ఒకరు వాగ్వాదానికి దిగారు.