కడపలో కలకలం..రక్తం వచ్చేలా వైసీపీ,టీడీపీ నేతల రాళ్ళ దాడి..!

Wednesday, November 7th, 2018, 11:00:31 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం మరియు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య వైరం ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు.ఈ రెండు పార్టీలకు సంబందించిన కార్యకర్తలు మరియు నేతల మధ్య జరిగే గొడవలే అందుకు నిదర్శనం.ఆ మధ్య కూడా వైసీపీ మరియు తెలుగుదేశం పార్టీల మధ్య రక్తం వచ్చేలా కొట్టుకున్న కొట్లాటలు కలకలం రేపాయి,ఇప్పుడు కూడా కడప జిల్లాలో అదే స్థాయిలో మళ్ళీ తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు.

కడప జిల్లా బద్వేల్ కొంగలవీడులో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేత వెంకట సుబ్బా రెడ్డి,వైసీపీ కి చెందిన శంకర్ రెడ్డి లకు మాటామాటా పెరిగి అది ఒకరి మీద ఒకరు రాళ్ళ దాడికి పాల్పడే స్థాయికి తీసుకెళ్లింది.అయితే ఈ దాడిలో వైసీపీ నేత అయినటువంటి శంకర్ రెడ్డికి తల పగిలి తీవ్ర రక్త స్రావం జరిగినట్టు కూడా తెలుస్తుంది.దీనితో అతన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు అతనికి చికిత్స నిర్వహించి కట్టు కట్టినట్టు తెలుస్తుంది.