విచ్చలవిడిగా కొట్టుకున్న తెరాస,కాంగ్రెస్ కార్యకర్తలు..!

Wednesday, October 3rd, 2018, 05:21:44 PM IST

నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ మరియు వైసీపీ నాయకులు,వారి కార్యకర్తల మధ్య గొడవలు,ఒకరి మీద ఒకరు దాడులు మనం చూసాం.ఇప్పుడు ఈ తీవ్రత తెలంగాణా రాష్ట్రంలోకి కూడా పాకింది.అయితే ఇక్కడ తెలంగాణా మరియు కాంగ్రెస్ పార్టీలకు చెందినటువంటి నాయకులు మరియు కార్యకర్తల మధ్య పెద్ద స్థాయిలోనే గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.గోవర్ధనగిరి అనే గ్రామాన్ని అక్కన్నపేట మండలం నుంచి హుస్నాబాద్ మండలంలోకి మార్చాలని ఆ గ్రామస్థులు చేపట్టిన నిరసన వద్ద ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.

తెలంగాణా రాష్ట్రంలోని గోవర్ధనగిరి అనే గ్రామంలో తెరాసతో పోల్చితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బలం ఉంది అని సమాచారం. వారి గ్రామాన్ని అక్కన్నపేట మండలం నుంచి హుస్నాబాద్ మండలం లోకి మార్చాలని,అక్కడి గ్రామస్థులు అందరు ఏకమై ఒక్కసారిగా నిరసన చేపట్టారు,సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఎన్నికల ప్రచారం నిమిత్తం తెరాస మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అక్కడికి విచ్చేయగా గ్రామస్థులు అతని ప్రచారాన్ని అడ్డగించి,వారి గ్రామానికి అసలు ఏం చేశారు అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.దీనితో ఒక్కసారిగా ఇరు వర్గాల వారికి మధ్యలో విచ్చలవిడిగా కుమ్ములాటలు జరిగాయి.దీనితో ఆ గ్రామస్థులు కూడా గాయపడ్డారు.తెరాస ప్రభుత్వం వారు కావాలనే వారి మీదకు గూండాలను పంపి వారి మీద దాడి చేయించారని గ్రామస్థులు వాపోతున్నారు.