ఎన్నికల వేళ తెరాస,కాంగ్రెస్ నేతల మధ్య దాడుల కలకలం..!

Thursday, December 6th, 2018, 02:04:12 PM IST

ఈ రోజు గడిస్తే తెలంగాణా లోని ఎన్నో రోజుల నిరీక్షణకు తెర పడనుంది.దాదాపు 2 కోట్ల పై చిలుకు ఓటర్లు రేపు మళ్ళీ తమని పాలించే నాయకుడిని ఎన్నుకోనున్నారు.అయితే ఇప్పటివరకు అక్కడ తెరాస మరియు కాంగ్రెస్ నేతలు మాటల యుద్ధానికే పరిమితం అయితే ఇప్పుడు భౌతిక దాడులకు కూడా సిద్దపడ్డారు.తెరాస మరియు టీకాంగ్రెస్ నేతలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న సంఘటన ఇప్పుడు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే నిర్మల్ జిల్లాలోని అర్ధరాత్రి సమయంలో తెరాస నేత ఇంద్రకరణ్ రెడ్డి యొక్క మేనల్లుడు తన మీద దాడి చేసాడు అంటూ మహేశ్వర్ రెడ్డి ఆందోళన చేపట్టారు.దీనితో టీకాంగ్రెస్ ఇతర నేతలు మరియు మహేశ్వర్ రెడ్డి యొక్క అనుచరులు వారున్న ప్రదేశంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.అప్పటికే తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి టీకాంగ్రెస్ నేతలు తెరాస నేతల యొక్క వాహనాలను ధ్వంసం చేసేసారు.దీనితో అక్కడకి పోలీసులు చేరుకొని వెంటనే పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నించిన 3 గంటల తర్వాత వారు శాంతించారు.అని తెలుస్తుంది.