టిక్కెట్టు కేటాయింపులో వైసీపీ కార్య కర్తల్లోనే గొడవలు..!

Monday, October 1st, 2018, 03:25:47 PM IST

ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ పరిస్థితి కాస్త గందరగోళమే అని చెప్పాలి.ఇప్పటికే వై ఎస్ జగన్ మీద డబ్బులు ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడుతున్నారో వారికే టిక్కెట్టు కేటాయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.అంతే కాకుండా ఎప్పటి నుంచో పని చేస్తున్న వారిని తప్పించి కొత్త వాళ్లకి టిక్కెటు కేటాయిచడం కూడా మనం గమనించాం.ఇప్పటికే ఆ విషయం వంగవీటి రాధ విషయంలో వెల్లడైయింది,దీనితో వారిలో వారికే తీవ్రమైన వ్యతిరేకత మొదలయ్యింది.ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలోని చోటు చేసుకుంది.

గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం కార్యదర్శి కేటాయింపు వ్యవహారంలో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలే జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.గుంటూరు జిల్లా పశ్చిమ నియోజక వర్గంకి సంబంధించి ఎప్పటి నుంచో కార్యదర్శిగా ఉన్న అప్పిరెడ్డిని తప్పించి ఈ మధ్యనే చేరిన యేసు రత్నంను నియమించడం పట్ల అప్పిరెడ్డి వర్గం కార్యకర్తలు మండిపడుతున్నారు.ఎప్పటి నుంచో పని చేస్తున్న అప్పిరెడ్డిని కాదని ఈ మధ్యనే చేరిన యేసు రత్నంని ఎలా నియమిస్తారని ఇరువురి కార్యకర్తలు గొడవ పడుతున్నారు.మళ్ళీ అక్కడి కార్యదర్శిగా భాద్యతలు మళ్ళీ అప్పిరెడ్డికే అప్పగించాలని జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.