టీడీపీ vs వైసీపీ ధుమారం..అక్కడ ఉద్రిక్త పరిస్థితులు.!

Friday, November 9th, 2018, 12:30:01 PM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పక్క సోషల్ మీడియాలో టీడీపీ vs జనసేన మధ్య వార్ నడుస్తుంటే బయట మాత్రం టీడీపీ మరియు వైసీపీ మధ్య దుమారం చెలరేగుతుంది.ఇప్పటికే టీడీపీ మరియు వైసీపీ కార్యకర్తల మధ్య చాలా సార్లు తీవ్ర స్థాయిలో గొడవలు కొట్లాటలు చోటు చేసుకున్నాయి మరికొన్ని చోట్ల అయితే ఏకంగా రక్తాలు వచ్చేలా రాళ్లతో కూడా దాడి చేసుకున్నారు.ఇప్పుడు కూడా మళ్ళీ టీడీపీ మరియు వైసీపీ శ్రేణుల మధ్యనే బూతుల పురాణంతో తీవ్ర స్థాయి గొడవలు అయ్యాయి.

అయితే ఈ సంఘటన కర్నూల్ జిల్లా శ్రీశైలం లో చోటు చేసుకుంది.నంది మండపం వద్ద కొంత మంది టీడీపీ కార్యకర్తలు అక్కడ కొన్ని దుకాణాలు పెట్టుకోవడానికి అనుమతి తీసుకున్నట్టు తెలుస్తుంది.అయితే అప్పటికే ఆ ప్రాంతంలో వేరే వైసీపీ కార్యకర్త మరొకరు ఒక మొబైల్ కాంటీన్ ను నడుపుతున్నట్టు తెలుస్తుంది.అయితే ఆ కాంటీన్ ను తొలగించమని టీడీపీ నేతలు కోరగా దానికి ఆ వైసీపీ నేత ససేమిరా అనడంతో ఇద్దరి మధ్యలో ఒక్కసారిగా ధుమారం చెలరేగింది,దీనితో ఒక్క సారిగా ఇరు వర్గీయులు ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో బూతుల పురాణం మొదలు పెట్టారు.దానితో ఒక్క సారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.