సూసైడ్ చేస్కుందామని బ్రిడ్జి ఎక్కి ఇలా తిరిగి వచ్చాడు…వీడియో

Tuesday, March 27th, 2018, 10:00:36 PM IST

అది న్యూయార్క్‌ నగరంలోని రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ బ్రిడ్జి. కొన్ని వ్యక్తిగత విషయాలపై కలత చెంది ఆత్మహత్య చేసుకోవాలంటున్న ఓ వ్యక్తి ఈ బ్రిడ్జినే ఎంచుకున్నాడు. 31 ఏళ్ల వయసున్న సదరు వ్యక్తి బ్రిడ్జిపై 500 అడుగుల ఎత్తు వరకు ఎక్కి..కిందకు దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. అయితే అతన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ యూనిట్ ఆఫీసర్స్ విభాగానికి చెందిన సాంఛెజ్ అనే పోలీసు కనిపెట్టాడు. అతన్ని ఎలాగైనా కాపాడాలనుకున్న సాంఛెజ్ వెంటనే రెస్క్యూ టీంను అప్రమత్తం చేసి సంఘటనా స్థలానికి పిలిపించాడు.

న్యూయార్క్ సిటీ పోలీస్ విభాగం పెట్రోలింగ్ టీం వెంటనే బ్రిడ్జి కింద నుంచి ఈస్ట్ రివర్‌కు చేరుకుంది. ఇక పైనుంచి ఓ హెలికాప్టర్ అతన్ని కిందకి దూకకుండా పర్యవేక్షిస్తుంది. అయితే సూసైడ్ చేసుకోబోయే వ్యక్తి సాంఛెజ్ ని చూసి బ్రిడ్జి అంచుకువచ్చి దూకాలని ప్లాన్ వేశాడు. ఇంతలోనే రెస్క్యూ టీం సిబ్బంది రోప్‌వే సాయంతో అతని దగ్గరకు వచ్చాడు. అవతలివైపుకు లాగి అతన్ని రక్షించాడు. చాకచక్యంగా వ్యవహరించి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడిన సాంఛెజ్‌కు అంతా ప్రశంసలందించారు. ఇంతకీ ఆ వ్యక్తీ ఎందుకు చనిపోవాలనుకున్నాడు, అసలు అతని సమస్యలేంటి అన్న విషయాలపై చర్చించేందుకు అతన్ని న్యూయార్క్ నగరంలోని ప్రముఖ మానసిక వైద్యుని వద్దకి తీస్కువేల్లారని సమాచారం.