ఆళ్లగడ్డ పంచాయితిని సింగిల్ సిట్టింగ్ లో ఫినిష్ చేసిన సీఎం!

Saturday, April 28th, 2018, 12:19:16 PM IST

గత కొంత కాలంగా ఆళ్లగడ్డ నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీలో రాజకీయ విబేధాలు ఎక్కువగా రావడం పార్టీ అధిష్టానంలో అందరిని ఆందోళనకు గురి చేసింది. భూమా అఖిల ప్రియా – ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న వివాదాలు ఒక మీటింగ్ తో ముగిశాయి. చంద్రబాబు ఇద్దరితో చర్చలు జరపడంతో ఇరు వర్గ నేతలు చల్లబడ్డారు. చంద్రబాబు నిర్వహించిన సుదీర్ఘ సమావేశం తరువాత అన్ని అపోహలు తొలగిపోయాయి.

భేటీ అనంతరం వర్ల రామయ్యతో కలిసి అఖిల ప్రియా ఏవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆళ్లగడ్డ పంచాయితీ ఒక తీ కప్పుతో ముగిసిందని వర్ల రామయ్య తెలిపారు. ఇక అఖిల ప్రియా మాట్లాడుతూ.. గత కొంత కాలంగా జరిగిన పరిణామాలు చాలా బాధాకరం. ఆళ్లగడ్డ అంటే అభివృద్ధి ఒక్కటే గుర్తుకు రావాలని చెప్పారు. ఎలాంటి వివాదాలు వచ్చినా సామరస్యంగా పరిషక్రించుకోవాలని, ఒక కూతురిగా తనకు మంచి సలహాలు ఇచ్చినట్లు అఖిలప్రియ తెలిపారు.

అంతే కాకుండా ఇక నుంచి పార్టీ కోసం కలిసి పనిచేస్తామని అఖిల ప్రియా తెలిపారు. ఇక ఏవీ సుబ్బారెడ్డి కూడా అదే తరహాలో సమాధానమిచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన సలహామేలురకు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరోసారి ఇలాంటి విషయాలు జాగ్రత్తలు వహిస్తామని చెబుతూ.. పార్టీకి చంద్రబాబు చెడ్డపేరు తీసుకురామని ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.

  •  
  •  
  •  
  •  

Comments