తెలుగోడి ఆత్మ‌గౌర‌వం తాక‌ట్టు పెట్టారుగా!?

Monday, September 10th, 2018, 02:52:18 PM IST

ప్ర‌చారార్భాటంలో తేదేపా అధినేత చంద్ర‌బాబును కొట్టేవాళ్లే లేరు. ప్ర‌స్తుత డిజిట‌ల్ ట్రెండ్‌లో సామాజిక మాధ్య‌మాల ద్వారా తేదేపాకు ప్ర‌చారం చేస్తున్న తీరు ప్ర‌జ‌ల్లో విస్త్ర‌తంగా చ‌ర్చ‌కొచ్చింది. తాజాగా తెలుగు దేశం పార్టీ అధికారిక ట్విట్ట‌ర్‌లో ఎన్టీఆర్ ఫోటో ఆస‌క్తి రేకెత్తించింది. నాడు ఆత్మ‌గౌర‌వం కోసం తార‌క రామారావు తెలుగువారి త‌ర‌పున‌ చేసిన పోరాటానికి సంబంధించిన ఫోటోని ట్వీట్ చేశారు. ఇందులో నాడు కాంగ్రెస్‌కి వ్య‌తిరేకంగా నిన‌దించిన తెలుగు వాడైన‌ ఎన్టీఆర్‌కి బాస‌ట‌గా నిలిచిన కేంద్ర స్థాయి నాయ‌కులు ఉన్నారు.

తెలుగుప్రజల ఆత్మగౌరవం కోసం, హక్కుల సాధన కోసం కేంద్రంతో తలపడటం తెలుగుదేశం పార్టీకి ఆది నుంచీ తప్పింది కాదు. ఈ క్రమంలో నాడు ఎన్టీఆర్ కు కాంగ్రెస్ తో పోరాడాల్సివచ్చింది. నేడు చంద్రబాబుకు బీజేపీతో పోరాడాల్సి వచ్చింది. అలాంటి పోరాటంలో నాడు ఎన్టీఆర్ కు సన్నిహితమైన సహచరులే వీళ్లంతా“ అంటూ ఓ క్యాప్ష‌న్‌ని ఇచ్చారు. అవును ఇది వాస్త‌వ‌మే.. మెచ్చ‌దగిన‌దే.

అన్న‌ట్టు పెద్దాయ‌న సంగ‌తి స‌రే! బాబు మాటేమిటి? ఆయ‌న‌ భాజ‌పా-ఎన్డీయేకి వ్య‌తిరేకంగా కేంద్రంపై పోరాటం చేస్తున్నా చంద్ర‌బాబుకు ఎవ‌రూ ఎందుకు మ‌ద్ధ‌తివ్వ‌డం లేదు? స‌్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం, రాజకీయాల్ని, రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్టే రావ‌ణ కాష్టంలా తెలుగుదేశం పార్టీని త‌యారు చేశార‌ని అనుకోవాలా? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అభివృద్ధి కంటే అవినీతి గురించే ఎక్కువ చ‌ర్చ సాగేలా చేసిన నిర్వాకం వీళ్ల‌ది అనాలా? ఏపీలో మెజారిటీ పార్ట్ ఉన్న కాపుల్ని అణ‌గ‌దొక్కేందుకు చంద్ర‌బాబు ఎత్తుగ‌డ‌ల ఫ‌లితం ఇదేన‌ని అనుకోవాలా? నిరుద్యోగులు, మైనార్టీలు సైతం తేదేపాకి వ్య‌తిరేకంగానే ఉన్నారు. ఇక అధికారం మాటున తేదేపా నాయ‌కులు ప్ర‌జ‌ల్ని ఏ రేంజులో ఆడుకున్నారో చ‌ర్చ సాగుతోంది. ఇక తేదేపా హ‌యాంలో రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష‌ల కోట్ల విలువ చేసే భూముల్ని తేదేపా మంత్రులు అన్యాక్రాంతం చేయ‌డంపై మీడియాలో విస్త్ర‌త క‌థ‌నాలు వ‌చ్చాయి. వీట‌న్నిటికీ తోడు ఏపీ ప్ర‌త్యేక హోదా సాధించ‌లేక‌పోవ‌డానికి ప్ర‌ధాన‌ కార‌ణం చంద్ర‌బాబు చెత్త మైండ్ సెట్ అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అలానే ఎంతో కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టుకి కేంద్రం నిధులు ఇవ్వ‌కుండా ఆటాడుకున్నా.. తేదేపా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్నే కావాల‌నుకుంది. విశాఖ‌కు ప్ర‌త్యేక రైల్వే జోన్ రాక‌పోవ‌డానికి అధికార పార్టీ కుహానా క‌థ‌లేన‌న్న సంగ‌తిని ప్ర‌జ‌లు గుర్తెరిగారు. దీనిపై ప్ర‌తిప‌క్షాల‌న్నీ అంతెత్తున లేస్తున్నాయి. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గొంతెత్తి నిన‌దిస్తుంటే అత‌డిని అణ‌చివేసేందుకు ర‌క‌ర‌కాల కుట్ర‌ల‌కు చంద్ర‌బాబు పాల్ప‌డుతున్న సంగ‌తిని జ‌నం గుర్తెరిగారు. ఇక కేంద్రంలోనూ చంద్ర‌బాబుకు అనుకూలంగా ఎవ‌రూ లేరు. ఆయ‌న ఒంటెద్దు పోక‌డ‌లు న‌చ్చ‌క‌, గిట్ట‌క అంతా వ్య‌తిరేకుల‌య్యారు. అందుకే ఇప్పుడు భాజ‌పా తెలుగు దేశం పార్టీపై ఉక్కుపాదం మోపి ఏపీలో అధికారం ఛేజిక్కించుకునేందుకు క‌ల‌లు కంటోంది. బాబు తెలుగువాడి ఆత్మ‌గౌర‌వాన్ని ఏ రేంజులో తాక‌ట్టు పెట్టాడో ఇప్పుడైనా అర్థ‌మైందా? ఎన్టీఆర్ కాపాడితే, ఈయ‌న‌ తాక‌ట్టు పెట్టారంతే!

  •  
  •  
  •  
  •  

Comments