వీడియో : పంచె కట్టి నడవలేక నడుస్తూ.. అట్రాక్షన్ గా మారిన బాబు మనవడు..!!

Saturday, September 30th, 2017, 12:27:43 PM IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంతో కలసి విజయవాడ కనక దుర్గమ్మని సందర్శించు కున్నారు. కుటుంబ సమేతంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్ర కీలాద్రిపై చంద్రబాబు మనవడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. పంచె కట్టులో కనిపించిన బాబు బుల్లి మనవడు చూపరులని ఆకర్షించాడు.

పంచె కట్టులో నడవడానికి ఇబ్బంది పడుతుండే చంద్రబాబు వేలిని పట్టుకుని మెట్లపై నడిపించారు. కాగా చంద్రబాబు కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని, స్మార్ట్ పవర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లు త్వరగా పూర్తి కావాలని సంకల్పించుకున్నట్లు తెలిపారు. మన సంప్రదాయాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే తన మనవడిని గుడికి తీసుకు వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు.

Comments