వివేకానంద‌రెడ్డి మృతి : వైఎస్ ఫ్యామిలీపై సీఎం చంద్ర‌బాబు ప్ర‌శ్న‌ల వ‌ర్షం..!

Friday, March 15th, 2019, 10:57:43 PM IST

వైఎస్ వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణ వార్త తెలియ‌గానే త‌న‌కు చాలా బాధ క‌లిగింద‌ని ఏపీ ముఖ్య‌మంంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు కాసేప‌టి క్రితం మీడియాతో మాట్లాడారు. వివేకానంద‌రెడ్డి మృతి వైసీపీ శ్రేణులు రాజ‌కీయాల‌కు వాడుకోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. మొద‌ట గుండెపోటు అని, త‌ల‌కు గాయ‌మ‌వ‌డంతో గుడ్డ‌క‌ట్టారు. సీఐ వెళ్లేస‌రికే ర‌క్తాన్ని శుభ్రం చేశారన్నారు. అలా అన్ని ప్ర‌య‌త్నాలు చేసిన త‌రువాత వివేకానంద‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన‌ట్లు న‌మ్మించేందుకు యత్నించార‌న్నారు. ఇలా సీఎం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఫ్యామిలీపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

– శుక్ర‌వారం తెల్ల‌వారు జామున 5 గంట‌ల‌కు హ‌త్య జ‌రిగింద‌ని అంటున్నారు.. తెల్ల‌వారు జామున 5.30 గంట‌ల‌కు వైఎస్ వివేకానంద‌రెడ్డి పీఏ రామ‌కృష్ణారెడ్డి వెళ్లాడు.

– 5.30 నుంచి 6.30 ప్రాంతంలో వైసీపీ నేత‌, మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి వైఎస్ వివేకానంద‌రెడ్డి మృతిపై పోలీసుల‌కు ఫోన్ చేశాడు.
– అస‌లు వివేకానంద‌రెడ్డి మృతి విష‌యం అవినాశ్‌రెడ్డికి ఎవ‌రు చెప్పారు..?
– అవినాశ్‌రెడ్డి ఫోన్ ఇంకెంద‌రికి చేశాడు..?
– వాళ్లంద‌రి మ‌ధ్య‌లో ఏమేమి జ‌రిగాయి..?
– పోలీసుల‌కంటే ముందే.. పోస్టుమార్టం నిమిత్తం హాస్పిట‌ల్‌కు తీసుకోక‌పోక‌ముందే వివేకానంద‌రెడ్డి మృత‌దేహాన్ని చూసిన మీరు ఆయ‌న‌ది
స‌హ‌జ‌మ‌ర‌ణం కాదు.. హ‌త్య అని పోస్టు మార్టం రిపోర్టు రాక‌ముందే ఎందుకు చెప్ప‌లేక పోయారు..?
– స‌హ‌జ మ‌ర‌ణానికి, గుండెపోటుకు, హ‌త్య‌కు తేడా తెలీదా మీకు..?
– మీ ఫ్యామిలీలో ముఖ్య‌మైన వ్య‌క్తి, అత‌ను చంప‌బ‌డ్డాడు.. చంప‌బ‌డ్డ స‌మ‌యంలో ఎందుకు మీరు హైడ్ చేశారు.??
వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు గురికాబ‌డ్డాని ఎందుకు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేక‌పోయారు..?
ఎప్పుడైతే అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆసుప‌త్రికి తీసుకెళ్లాల్సి వ‌చ్చిందో.. డాక్ట‌ర్ పోస్టు మార్టం చేసే వ‌ర‌కు హ‌త్య అని చెప్ప‌కుండా దాచి
పెట్టార‌న్నారు. తాను అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నిటికి వైఎస్ఆర్ కుటుంబం స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు
అన్నారు.