ప్రతి శుక్రవారం బోనులో నించునే జగన్ నీకు నైతికత ఎక్కడుంది..?

Sunday, September 16th, 2018, 10:01:19 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రతిపక్ష నేత జగన్ మీద విరుచుకుపడ్డారు. నిన్న శ్రీకాకుళం జిల్లాలోని జరిగిన “జలసిరికి హారతి” అనే కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం అక్కడి తెలుగుదేశం కార్యకర్తలు మరియు అక్కడి అభిమానుల సమక్షంలో ఒక భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభను పురస్కరించుకొని ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు బీజేపీల మీద విమర్శల వర్షం గుప్పించారు.

అక్కడి సభలో మాట్లాడుతూ తండ్రి యొక్క అధికార ముసుగుని అడ్డు పెట్టుకొని వేల కోట్లు దోచుకున్న వై ఎస్ జగన్ తన మీద అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది అని పేర్కొన్నారు. అంతే కాకుండా అక్రమాస్తుల కేసుల నిమిత్తం ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్లి బోనులో ముద్దాయిలా నించునే జగన్ కి అసలు నైతికత ఎక్కడ ఉంది..? అని ప్రశ్నించారు.అదే సందర్భంలో మాట్లాడుతూ వైసీపీ మరియు పవన్ లకు ఓట్లు గనుక వేస్తే అక్కడ కేంద్రంలో బీజేపీకి వేసినట్టే అని అన్నారు. రాష్ట్రానికి ఏమైనా మంచి చేస్తారు అని కేంద్రానికి మద్దతు పలికితే వారు రాష్ట్రానికి తీరని అన్యాయం చేసారు అని నరేంద్ర మోడీ పై కూడా మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments