తుంగభద్రపై చెక్ డ్యాంకి సీఎం గ్రీన్ సిగ్నల్

Thursday, June 6th, 2013, 04:14:09 PM IST

రాష్ట్ర ప్రభుత్వం తుంగబద్ర నదిపై చెక్ డ్యాంను నిర్మించనుంది. అవును నిజం ఈ విషయాన్నీ విని సంబంధిత అధికారులే ఆశ్చర్యానికి గురైయ్యారు. పెద్ద పెద్ద నదులపై ఆనకట్టలు నిర్మించడం, రిజర్వాయర్లు నిర్మించడం మామూలే కానీ తుంగభద్ర నదిపై చెక్ డ్యాం నిర్మించడం ఏమిటా అని అదికారు అనుకుంటున్నారు. దీనికి కారణం కర్నూల్ జిల్లాకు చెందిన ఒక మంత్రి ముఖ్యమంత్రి పై తీవ్రంగా వత్తిడి తీసుకురావడం వల్లనే ఈ డ్యాం నిర్మాణానికి అయన అంగీకరించారని సమాచారం. రూ. 64.90 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న ఈ డ్యాంకు ముఖ్యమంత్రి అనుమతించడంతో ఆ బిల్లు ఆర్ధిక శాఖాకు పంపించడం జరిగింది. త్రాగునీటి కోసం, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఈ డ్యాంనిర్మిస్తున్నాటు ప్రభుత్వం చెబుతోంది. కానీ కృష్ణ బేసిన్ పై బ్రిజేష్ కుమార్ ట్రేబ్యునల్ ఎదుట వాదనలు జరుగుతునడగానే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం పై అధికారులను ప్రశ్నించగా ఒత్తిడి వల్లే ఇలా చేయవలసి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

ఈ డ్యాం నిర్మాణం విషయంపై 2011 ఆగష్టు 18న కర్నూల్ సీఈ నీటిపారుదల శాఖ కార్యదర్శికి నివేదిక పంపగా దానిని ఆమోదించలేదు. అలాగే ఆర్థిక శాఖ కూడా అనుమతించలేదు. త్రాగునీటి కోసం అయితే ప్రజారోగ్య శాఖనో, పురపాలక శాఖనో ఈ పనులు చేపట్టాలని సూచించింది. ప్రస్తుతం ఈ నిర్మాణ బాధ్యతని ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ కు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ తుంగభద్ర నదిపై నిర్మించనున్న ఈ డ్యాం చిన్న నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ప్రతిపాదించాడు. అంతేకాదు సహజంగా ఇలాంటి ప్రతిపాదనలు ఒకరి చేతినుండి మరొకరి చేతిలోకి మారడానికి ఒక నెల రోజులైనా పడుతుంది. కానీ ఈ డ్యాం విషయంలో మాత్రం అన్ని విభాగాల వారు కేవలం నాలుగు రోజుల్లో సిఫార్స్ చేస్తూ లేఖను రాశారు.