ఆ ముగ్గురిలో ఎవరైనా సరే.. చంద్రబాబుకు దబిడిదిబిడే..!

Wednesday, June 5th, 2019, 07:15:39 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గత నెల 30వ తేదిన ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 8వ తేదిన తన మంత్రివర్గ కేబినెట్‌ను కూడా ప్రకటిస్తానని సీఎం జగన్ ఇప్పటికే చెప్పేసారు. అయితే అందుకు తగ్గ ప్రత్యమ్నాయలు కూడా జగన్ ఇప్పటికే పూర్తిగా చేపట్టారని, మంత్రివర్గ స్థానంలో చోటు కల్పించడంకోసం చాలా పేర్లను పరిశీలిస్తున్నారట సీఎం వైఎస్ జగన్. అయితే దానితో పాటు స్పీకర్, డిప్యూటి స్పీకర్ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై కూడా జగన్ ఆలోచిస్తున్నారట.

అయితే ఏది ఏమైనా స్పీకర్ పదవిలో మాత్రం చంద్రబాబుకు దిమ్మతిరిగే వ్యక్తిని నియమించాలని అనుకుంటున్నారట జగన్. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు తోడళ్ళుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావును నియమించాలని అంతా అనుకున్నరు. అయితే ఆయన ఓడిపోవడంతో ఇప్పుడు స్పీకర్ స్థానానికి తెర మీద చాలా పేర్లు వినబడుతున్నాయి. అయితే ఫైనల్‌గా సీఎం జగన్ మాత్రమ్ముగ్గురు పేర్లను ఖరారు చేశాడట. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాంకి స్పీకర్ పదవి అప్ప చెప్పాలని జగన్ భావిస్తున్నాడట. అయితే ఈయన టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. చంద్రబాబుపై పీకల్లోతు కోపంతో ఉన్న తమ్మినేనికే స్పీకర్ పదవి అప్పగించడం కరెక్ట్ అని అనుకుంటున్నారట.

అంతేకాదు ఇంకో పేరును కూడా జగన్ పరిశీలిస్తున్నారని పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా ఇమేజ్ సొంతం చేసుకున్న రోజాను స్పీకర్ చేయాలన్న ప్రతిపాదన కూడా జగన్ ముందు ఉందట. గత సభలో ఆమెను అనవసరంగా ఏడాది పాటు సస్పెండ్ చేసి సభలో ఆమె ముఖం చూడనని మాట్లాడిన చంద్రబాబుకు ఇప్పుడు స్పీకర్ స్థానంలో రోజాను కూర్చోబెడితే చంద్రబాబు నిజంగా తలెత్తుకోలేడు అని అనుకుంటున్నారట. అంతేకాదు గుంటూర్ జిల్లాకు చెందిన అంబటి రాంబాబుని స్పీకర్ చేయాలని న్యాయవాది, సీనియర్ మెంబర్‌గా టీడీపీపై, చంద్రబాబుపై ఎప్పటికప్పుడు విరుచుకుపడే నేతగా ఉన్న అంబటిని స్పీకర్ స్థానంలో కూర్చోబెడితే చంద్రబాబును ముప్పు తిప్పలు పెట్టడం ఖాయమని అందరూ అనుకుంటున్నారట. అయితే ముగ్గురు పేర్లు ప్రతిపాదనలో ఉన్నా అసలు ఎవరిని స్పీకర్ స్థానంలో కూర్చోబెడుతున్నారో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు స్పీకర్ స్థానంలోకి వచ్చినా టీడీపీ అధినేత చంద్రబాబుకు దబిడిదిబిడే అంటున్నారు వైసీపీ నేతలు.