జ‌నం సొమ్ము దుబారా.. సీఎం గారి డాబు ద‌ర్పం!

Friday, January 11th, 2019, 12:48:27 PM IST

దేశంలోనే కాస్ట్ లీ సీఎం ఎవ‌రు? అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అని చెబుతున్నారు కామ‌న్ జ‌నం. ఖ‌రీదైన గౌర‌వ‌ పారితోషికం అందుకోగ‌లడు.. ఖ‌రీదైన పాల‌న చేయ‌గ‌ల‌డు.. ఖ‌రీదైన కాన్వాయ్ ని మెయింటెయిన్ చేయ‌గ‌ల‌డు.. అందుకే ఆయ‌న కాస్ట్ లీ సీఎం.

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మిని మ‌ట్టిక‌రిపించిన కేసీఆర్ మరోసారి ముఖ్య‌మంత్రి పీఠాన్ని ద‌క్కించుకుని అస‌లైన ఆట మొద‌లు పెట్టారు. ఆయ‌న మ‌రోసారి త‌న కాన్వాయ్‌ని మార్చ‌బోతున్నారన్న‌ది వేడెక్కిస్తోంది. తొలి ద‌ఫా రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రిగా తెరాస ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయ‌న అప్ప‌ట్లో వున్న బ్లాక్ కార్ల‌ కావ్వాయ్‌ని ప‌క్క‌న పెట్టి సెంటిమెంట్ ప్ర‌కారం వైట్ కార్ల కాన్వాయ్‌ని కొనుగోలు చేశారు. ఇప్ప‌డు మ‌ళ్లీ ఆ కాన్వాయ్‌ని ప‌క్క‌న పెట్ట టాయోటా కార్ల‌ని కొనుగోలు చేయ‌బోతున్నార‌ని తెలిసింది.

తెలంగాణ సీఎం ర‌క్ష‌ణ విష‌యంలో రాజీప‌డ‌ని ఇంటెలిజెన్స్ విభాగం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ర‌క్ష‌ణ కోసం హైఎండ్ కార్త కాన్వాయ్ అవ‌స‌ర‌మ‌ని నిర్ణ‌యించార‌ట‌. ఇందు కోసం మెర్సిడెస్ బెంజ్ కార్ల‌తో పాటు ప‌లు కార్ల‌ను ప‌రిశీలించి చివ‌రికి టాయోటా కార్ల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు చెబుతున్నారు. ఇందులో సీఎం కోసం ప్ర‌డోస్ కారును ఎంపిక చేశార‌ట‌. ఈ కారు విలువ 93 ల‌క్ష‌లు. మెర్సిడెస్ బెంజ్ కారుని కొనాల‌ని ఇంట‌లిజెన్స్ విభాగం సూచించినా కేసీఆర్ అందుకు అంగీక‌రించ‌లేద‌ని తెలిసింది. ఈ విష‌యం తెలిసిన రాజ‌కీయ విశ్లేష‌కులు మాత్రం తెలంగాణ ముఖ్య‌మంత్రి జ‌నం సొమ్మును ఇలా కార్ల కోసం దుబారా చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న‌గారి డాబు ద‌ర్పం చూపించ‌డానికి జ‌నం సొమ్ములే కావాలా? అని తిట్టేస్తున్నారు కొంద‌రైతే.