జస్ట్ ఫర్ లాఫ్స్ : ఇది కాదు గురూ..పెద్ద రాజాకీయ నాయకుడి బిల్డింగ్ ను కొట్టండి..!

Thursday, September 29th, 2016, 12:01:48 AM IST

cracj-down
హైదరాబాద్ లో వర్షాలతో డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో టిఆర్ ఎస్ ప్రభుత్వం దానిపై దృష్టిసారించింది.నాళాల పై అక్రమ కట్టడాల పుణ్యమే ఇదంతా అని కేసీఆర్ వాపోయిన సంగతి తెలిసిందే.అక్రమమగా కట్టిన నిర్మాణం ఎవరిదైనా కూల్చేస్తాం అని కేసీఆర్ హెచ్చరించిన విషయం తెలిసిందే.రాజకీనాయకుడైనా, కార్పొరేటర్ అయినా సరే కూల్చేస్తాం..వదులుడు, గిదులుడు నై .. అని కేసీఆర్ ప్రకటించారు.కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం వేరేగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.బడా రాజకీయనేతల సంబందించిన వాటి జోలికి పోకుండా చిన్నా చితకా మధ్య తరగతి కట్టడాలపై ఎక్కువగా ద్రుష్టి సారించినట్లు సైటెర్ లు పడుతున్నాయి.సీఎం గారు ఇదంతా కాదు ఒక్క బడానేత బిల్డింగ్ ను కూల్చండి.. మీకు మస్త్ పబ్లిసిటీ వస్తది..!