నేను రాజీనామా చేయడానికి రెడీ : సీఎం కేసీఆర్..ఎందుకో తెలుసా.?

Friday, April 27th, 2018, 01:45:53 PM IST

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. టీఆర్‌ఎస్ నాయకులను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకోమని ఉత్తమ్‌ను కేసీఆర్ హెచ్చరించారు. ప్రగతి భవన్‌లో 150 గదులు ఉన్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నాడు. ప్రగతి భవన్‌లో 15 గదుల కంటే ఎక్కువ లేవు. 16వ గది ఉందని రుజువు చేస్తే.. తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని సీఎం స్పష్టం చేశారు. అక్కడ 16వ గది లేకపోతే ప్రగతి భవన్ ముందు ఉత్తమ్ ముక్కు నేలకు రాస్తాడా అని సీఎం ఛాలెంజ్ చేశారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి టీ పీసీసీ పదవి తెచ్చిందే ఈ గులాబీ జెండా అని కేసీఆర్ తెలిపారు. ఆనాడు పోరాటం చేయకపోతే నీవు ఈ రోజు పదవిలో ఉండే వాడివి కాదు. తమ పోరాటం వల్లే తెలంగాణ సాధించుకున్నాం. 14 సంవత్సరాల పోరాటమే నేటి తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నాలుక ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. కాంగ్రెస్ నాయకులు తెలివి లేని నేతలు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.

  •  
  •  
  •  
  •  

Comments