బ్రేకింగ్ న్యూస్ : అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్!

Thursday, September 6th, 2018, 02:51:08 PM IST

తెలంగాణలో అసెంబ్లీ ని రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ మరియు వారి మంత్రి వర్గంతో సమావేశం అయ్యి దాని పై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీస్కొని అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఆ వినతి పత్రాన్ని కే సి ఆర్ వారి మంత్రి వర్గం తో సహా గవర్నర్ కి అందించినట్టు తెలుస్తుంది. ఈ విషయం బట్టి తెలంగాణా లో ముందస్తు ఎన్నికలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది.

అయితే ముందు గానే వారి మంత్రలు అందరికి చేసిన ఆదేశాలు మేరకు అందరు ప్రగతి భవన్ లో జరిగిన అత్యవసర సమావేశానికి హాజరు అయ్యారని ఆ తర్వాత అసెంబ్లీ రద్దు కోసం మరియు ముందస్తు ఎన్నికల కోసం కే.సి.ఆర్ చర్చించి, వారి మంత్రుల అందరూ ఇందుకు గాను ఆమోదం తెలుపుతున్నట్టుగా అందరి సంతకాలతో సహా ముఖ్యమంత్రి సంతకంతో కూడా ఆ నివేదికను గవర్నర్ నరసింహన్ గారికి అందించారు. ఎన్నికలలుకి ఇంకా తో తొమ్మిది నెలలు గడువు ఉండగానే అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు తెలిపారు కాసేపటి తర్వాత ఆ సిఫార్సు ని అధికారకంగా సి ఎం కే.సి.ఆర్ ప్రకటించనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments