దోపిడీ క‌థ‌ : సీఎం ర‌మేష్ వేలకోట్లు!?

Saturday, October 13th, 2018, 09:55:10 AM IST

మోదీ టార్గెట్ – ఎక్స్ ఫ‌లిస్తోంది! టీడీపీ శ్రేణుల్ని భ‌య‌పెట్టాలన్నా…బీజేపీపై తేదేపా స్వ‌రంలో మార్పు రావాల‌న్నా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయ‌కుల ఆర్థిక బ‌లంపై దెబ్బ‌కొట్టాల్సిందే. కేంద్రంలోని భాజపా-ఎన్డీఏ ప్ర‌భుత్వం ఆ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా సాగిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ, ఏపీల్లోని టీడీపీ ముఖ్య నాయ‌కుల ఆర్థిక బ‌లంపై దృష్టిపెట్టి ఐటీ దాడులు చేయ‌డం ప్రారంభించింది. అయితే ఈ దాడుల్లో ఉభ‌య రాష్ట్రాల ప్ర‌జ‌లు, నాయ‌కుల‌కు క‌ళ్లు బైర్లు క‌మ్మే వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. కేంద్రం త‌ల‌పెట్టిన ఐటీ దాడుల్లో భాగంగా ఏపీ టీడీపీ నాయ‌కుడు సీఎం ర‌మేష్‌కు సంబంధించిన మ‌ఖ్య‌కార్యాల‌యాల‌పై దాడులు జ‌రిగాయి.

ఈ దాడుల్లో షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ‌టం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీస్తోంది. అతి త‌క్కువ స‌మ‌యంలోనే సీఎం ర‌మేష్ క‌రోడ్ ప‌తిగా ఎదిగిన వైనం సామాన్సులు, మాన్యుల‌నే కాకుండా రాజ‌కీయ వ‌ర్గాల్ని కూడా ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ప్రొహిబిష‌న్ టైమ్ అంటే 1994 నుంచి 1996 కాలం వ‌ర‌కే ర‌మేష్ భారీగా ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్టు తెలుస్తోంది. క‌ర్ణాట‌క బోర్డ‌ర్ నుంచి రాయ‌ల‌సీమ జిల్లాల‌కు లిక్క‌ర్‌ను అక్ర‌మంగా త‌ర‌లించి భారీగానే సొమ్ముచేసుకున్నాడ‌ని ఐటీ వ‌ర్గాల విచార‌ణ‌లో తేలిన‌ట్లు చెబుతున్నారు. ఆ స్మ‌గ్లింగ్ ద్వారా అంగ‌బ‌లాన్ని, అర్థ‌బ‌లాన్ని స‌మ‌కూర్చుకున్న ర‌మేష్ అక్క‌డి నుంచి బ‌డా కాంట్రాక్ట‌ర్‌గా అవ‌త‌రించాడు.

టీడీపీ హ‌యాంలో హంద్రీనీవా సుజ‌ల స్ర‌వంతి, గాలేరు న‌గ‌రు సుజ‌ల స్ర‌వంతి, వెలిగొండ ట‌న్నెల్ ట‌వ‌ర్స్‌, గండికోట రిహ‌బిలిటేష‌న్ వ‌ర్క్‌ల‌ను సీఎం ర‌మేష్‌కు సంబంధించిన రిత్వ‌క్ ప్రాజెక్ట్ పూర్తి చేసింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇటీవ‌ల జ‌రిపిన ఐటీ రైడ్‌లో దొరికి న‌ట్లు చెబుతున్నారు, ఈ ప్రాజెక్ట్ ల ద్వారా ర‌మేష్ కుటుంబీకుల‌కు, బినామీల‌కు 3,658 కోట్లు వ‌చ్చిప‌డ్డాయి. ఈ ప్రాజెక్ట్ ల‌కు టీడీపీ ఎలాంటి టెండ‌ర్‌లు వేయ‌లేదు. దీని వెనుక చంద్ర‌బాబు హ‌స్తం కూడా వున్న‌ట్లు అందులో ఆయ‌న‌కు భాగం వుంద‌ని కూడా రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి.