పీఏసీ సభ్యుడిగా సీఎం రమేష్ అద్భుత విజయం …!

Tuesday, August 7th, 2018, 12:02:20 PM IST

పార్లమెంట్లో ప్రతిష్టాత్మక పదవుల్లో ఒకటైన ప్రజా పద్దుల కమిటీ ఎన్నికల్లో పీఏసీ కమిటీ సభ్యుడిగా సీఎం రమేష్ అద్భుత విజయాన్ని అందుకున్నారు. దీనికి ప్రధాన కారణం పార్లమెంట్ లో విపక్షాలన్నీ కూడా ఐక్యతతో కూడి ఆయనకు ఓట్లేయడమే అని తెలుస్తోంది. అంతే కాదు, గతంలో ఇన్ని ఓట్లతో ఎవరు ఇలా విజయం సాధించలేదని, దీనికి అంతటికి కారణమైన విపక్ష పార్టీలు మరియు ఆయా సబ్యులకు తమ తెలుగుదేశం పార్టీ తరపున రమేష్ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఎన్నికల్లో ఏపీలోని ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి కూడా ఆయనకే మద్దతు పలికింది. ఇక అవిశ్వాసతీర్మాన సమయంలో బిజెపికి మద్దతిచ్చిన టిఆర్ఎస్ మరియు అన్నాడీఎంకే పార్టీలు సైతం రమేష్ కు ఓటేశాయి. ఇక కాంగ్రెస్ కు చెందిన మన్మోహన్ కూడా రమేష్ కి ఓటేసి మద్దతు తెలిపారు. నిన్న పార్లమెంట్ లోని రెండు పిఏసీ లకు జరిగిన ఓటింగ్లో విపక్ష పార్టీలన్నీ

అనగా, టిఆర్ఎస్, వైసిపి, అన్నాడీఎంకే, వామపక్షాలు మరియు బీజేడీ పార్టీకి చెందిన ఎంపీలు అందరూ కూడా అయన పక్షాన నిలిచి సమైక్యంగా మద్దతుతెలిపి ఓటు వేయడంతో రమేష్ మొత్తం 106 సీట్లతో విజయాన్ని అందుకున్నారు. కాగా ఆయనకు ప్రత్యర్థిగా నిలిచిన బీజేపీ అభ్యర్థి భూపేంద్ర యాదవ్ కు 69 ఓట్లు మాత్రమే లభించాయి. ఇక బీజేపీ మద్దతుతో నిలబడ్డ జేడీయు అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు కేవలం 29 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. అయితే మొదట్లో రమేష్ ను పోటీ నుండి తప్పించాలని బీజేపీ నేతలు విశ్వప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడుగా ఉన్నందున ఆయనను ఈ పీఏసీ సభ్యుడి ఎన్నికకు పోటీ చేయడానికి వీలులేదని అడ్డగించారు. అయినప్పటికీ సీఎం రమేష్ పట్టుపట్టడం, అనూహ్యంగా విపక్షాలన్నీ కూడా ఆయనకు వెన్నుదన్నుగా నిలవడం ఆయనకు కలిసివచ్చినట్లైంది. కాగా ఇదే స్ఫూర్తిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని విపక్షపార్టీల అన్నిటిని టీడీపీ కోరుతున్నట్లు తెలుస్తోంది…..

  •  
  •  
  •  
  •  

Comments