కర్ణాటక రాష్ట్ర చరిత్రలో తక్కువ కాలం సీఎం గా పనిచేసింది వీళ్ళే..!

Saturday, May 19th, 2018, 08:16:21 PM IST

గతంలో ఎన్నడూలేని రాజకీయ పరిణామాలు ఈ సారి కర్ణాటక రాష్ట్రంలో నెలకొన్నాయి.గంట గంటకూ అటు ప్రజల్లో ఇటు రాజకీయ నాయకుల్లో పెరుగుతున్న రసపూరితమైన కర్ణాటక రాజకీయ పరిణామాల మద్య రెండు రోజుల ముందు రాష్ట్ర ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భాజాపా శాసనసభాపక్ష నేత, యడ్యూరప్ప.ఈ రోజు సాయంత్రం గవర్నర్ పెట్టిన బలనిరూపణ పరీక్షకు ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, బలనిరూపణ పరీక్షలో కూడా ఘోర పరాజితపాలయ్యాడు. తక్కువ స్థానాలు పొందినా కూడా కాంగ్రెస్ తో మహాకూటమిగా చేరినందున సుడి తిరిగి జేడీఎస్ పార్టీ అధినేత కుమార స్వామి కుర్చీ ఎక్కాడు. కానీ ఇలాంటి చాలా కారణాలతో సీఎం పదవి చేతి వరకూ వచ్చి చేజారిపోయిన ముఖ్య మంత్రులు చాలా మందే ఉన్నారు.
శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ ఒక్క రోజు సీఎంగా పనిచేసినట్టు మనదేశంలో చాలా మంది నాయకులు కూడా చాలా తక్కువ రోజులు సీఎంగా పనిచేసిన సందర్బాలు ఉన్నాయి. అలాంటి వారి జాబితా మీద మనమూ ఒక్క లుక్ వేద్దాం.

1.హరీష్ రావత్: ఉత్తరాఖండ్ ఒక్క రోజు సీఎం
2.జగదంబికా పాల్ : ఉత్తర ప్రదేశ్ రెండు రోజులు సీఎం
3.యడ్యూరప్ప : కర్ణాటక రెండు రోజులు సీఎం
4.ఓపీ చౌతలా : హర్యానా ఐదు రోజులు సీఎం
5.సతీష్ ప్రసాద్ సింగ్ : బీహార్ తొమ్మిది రోజులు సీఎం
6.ఎన్ సి మరాక్ : మేఘాలయ పదకొండు రోజులు సీఎం
7.జానకీ రామచంద్రన్ : తమిళనాడు ఇరవైమూడు రోజులు సీఎం
8.బీపీ మండల్ : బీహార్ ఇరవై ఆరు రోజులు సీఎం
9.సీహెచ్ మొహమ్మద్ కోయ: కేరళ 49 రోజులు సీఎం

  •  
  •  
  •  
  •  

Comments