నవ్యాంధ్రప్రదేశ్ కు దొరికిన మరో వనరు

Wednesday, September 10th, 2014, 04:21:33 PM IST


ఆంధ్రాకు అన్నీ ఉన్నాయ్.. సముద్రతీరం.. పుణ్యక్షేత్రాలు, నీటివనరులు, ఖనిజాలు.. ఇలా అన్నీ ఉన్నాయ్.. దానికి తోడు ఇప్పుడు అపార బొగ్గు నిక్షేపాలు కూడా బయటపడ్డాయి. ఇప్పటి వరకు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాకు బొగ్గు వనరులు లేవు. కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలో బయటపడ్పిన అపార బొగ్గు నిక్షేపాలు ఆంధ్రాలో బొగ్గు లభ్యంకాదు అనే అభిప్రాయం తప్పని బుజువు చేస్తున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయి.

తెలంగాణలోని పలు జిల్లాల్లో సింగరేణి గనులు వ్యాపించి ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాంలో మాత్రం బొగ్గు నిల్వలు లేవు. తెలంగాణ ఉద్యమం జోరుగా నడస్తున్న రోజుల్ల్లో తెలంగాణలోని బొగ్గు నిల్వలను ఆంధ్రాకు తరలిస్తున్నారంటూ తెలంగాణవాదులు ఆరోపించేవారు. వాస్తవానికి విటీపీఎస్ లోనూ.. ఇతర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోనూ సింగరేణి బొగ్గు వాడకం చాలా తక్కువ. కానీ ఆంధ్రాలో ఎక్కడా బొగ్గు నిల్వలు లేకపోవడం.. తెలంగాణలో సింగరేణి బొగ్గు పుష్కలంగా లభించడంతో ఈ ఆరోపణలకు ప్రాచుర్యం లభించింది. దీంతో ఆంధ్రాకు తెలంగాణ కంటే ఎన్నో వనరుల విషయాల్లో సానుకూలత ఉన్నా.. బొగ్గులేదనే లోటు మాత్రం అలాగే ఉండిపోయింది

తాజాగా ఆంధ్రాలోనూ బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు వెయ్యి 30 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు ప్రాథమికంగా తేలింది. ఈ నిల్వలపై దృష్టి సారిస్తే రెండు మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఈ బొగ్గు నిల్వలు ఎక్కువగా చింతలపూడి, రాఘవాపురం, జంగారెడ్డి గూడెం, తడికెలపూడి గ్రామాల సమీపంలో ఉన్నాయని చెబుతున్నారు. ఈ బొగ్గు నిల్వలతో ఇనాళ్లు తెలంగాణే పరిమితమైన బొగ్గు లభ్యం.. ఆంధ్రప్రదేశ్ లోనూ లభించి.. ఆంధ్రాకు బొగ్గు లోటు తీరనుందని చెబుతున్నారు

ఇక నిరంతర విద్యుత్ సరఫరా నేపథ్యంలో విద్యుదుత్పత్తి కీలకంగా మారిన వేళ.. ఈ కబురు ఆంధ్రాసర్కారుకు ఊరట కలిగిస్తోంది. ఆధునిక సమాజంలో విద్యుత్ వినియోగం ప్రాధాన్యత తెలిసిందే. ఈ విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే బొగ్గు నిల్వలు అందుబాటులోకి వస్తే సీమాంధ్రలో అభివృద్ధికి మరో ఊతం దొరికినట్టే..