కూల్ డ్రింక్ లో బొద్దింకలు…..ప్రశ్నించినందుకు ఫుడ్ కోర్ట్ మేనేజర్ దాడి!

Thursday, May 17th, 2018, 05:23:01 PM IST

నిత్యం మనం బయట చిన్న చిన్న బండ్ల దగ్గర, స్టాల్స్ లోను తినే ఆహారపదార్ధాలలో చాలా వరకు కల్తీవే ఉంటున్నాయి. చాలా మంది ఆలోచించి తినాలా, వద్దా అంటూ తింటుంటారు. అదే ఏదైనా పెద్ద బ్రాండెడ్ స్టోర్ లో ఐతే మాత్రం ఏమి ఆలోచించ కుండా తింటుంటాం దానికి కారణం అవి మంచి క్వాలిటీ మెయిన్ టెయిన్ చేస్తాయి అలానే మంచి రుచి, నాణ్యత గల ఆహారాన్ని మనకందిస్తాయని అనుకుంటాం. అయితే ఆ మధ్య ఒక ప్రముఖ బ్రాండెడ్ చికెన్ లో పురుగులు రావడం చూసాం, అలానే కొన్ని కూల్ డ్రింక్స్ లో కూడా చిన్న పురుగులు, మేకులు వంటివి దర్శనమిచ్చాయి. ఇకనేడు అసలు విషయానికి వస్తే, హైదరాబాద్ పంజాగుట్ట లోని సెంట్రల్ మాల్ లో వున్న ప్రముఖ అవుట్ లెట్ కి నేడు తన కుమార్తెతో కలిసి వెళ్లిన వంశి కృష్ణరెడ్డి అనే కస్టమర్, కూల్డ్రింక్స్ మరియు ఇతర ఆహారపదార్దాలు ఆర్డర్ చేసాడు.

అయితే కూల్డ్రింక్ ను అతని కూతురు తాగింది, డ్రింక్ తాగడం పూర్తి అయ్యాక తాగిన గ్లాస్ ను గమనిస్తే అడుగున చిన్న బొద్దింకలు కనిపించాయి. దానితో ఒక్కసారిగా షాక్ అయినా వంశి, వెనువెంటనే మేనేజర్ ను కలిసి విషయం వివరించాడు. ఇంత నిర్లక్ష్యంగా కస్టమర్ లకు ఫుడ్ ఎలా సప్లై చేస్తారని ప్రశ్నించాడు. దానికి నీళ్లు నమిలిన ఆ లేడీ మేనేజర్ గట్టిగా అరుస్తూ మీరు బయటకు నడవండి అంటూ రిప్లై ఇస్తూ తిట్ల దండకం మొదలుపెట్టింది. ఈ మొత్తం ఉదంతాన్ని వంశి తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేస్తుండగా అక్కడి సెక్యూరిటీ సిబ్బందితో వంశి మరియు అతడి కూతురిని అమానుషంగా స్టోర్ నుండి బయటకు పంపేసింది మేనేజర్. విషయం మొత్తానికి సోషల్ మీడియాకి ఎక్కడంతో నెటిజన్లు సదరు సబ్ వే సంస్థపై, ఆ సంస్థ మేనేజర్ పై ఆగ్రహం తో పోస్ట్ లు చేస్తున్నారు. సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments