త్రివిక్రమ్ దర్శకత్వంలోనే పవన్,ఎన్టీఆర్ లకు ఇలా జరిగింది..!

Wednesday, October 3rd, 2018, 08:53:08 PM IST


పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ లు ఎలాంటి స్నేహితులో వేరే చెప్పనక్కరలేదు,ఇప్పుడు అదే జాబితాలోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు.గత కొద్ధి రోజుల క్రితం నందమూరి వారి ఇంట్లో ఒక విషాధ సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసినదే,ఆ సమయంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు ఎంతగా అండగా నిలబడ్డాడో నిన్న జరిగిన అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు.అంతే కాకుండా ఈ చిత్రంలోని తన తండ్రికి చితి పెట్టే సీన్ గురించి చెప్పుకుంటూ ఎన్టీఆర్ కంటతడి పెట్టుకొని అందరి గుండెలను బరువెక్కించేసారు.

ఇప్పుడు ఇలాంటి సంఘటనే యాదృచ్చికంగా పవన్ కళ్యాణ్ జీవితంలో కూడా జరిగింది.త్రివిక్రంతో తన మొదటి సినిమా జల్సా షూటింగ్ సమయంలోనే పవన్ కళ్యాణ్ యొక్క తండ్రి కూడా మరణించారు,అదే విధంగా అదే చిత్రంలో తన తండ్రికి చితి పెట్టే సన్నివేశం కూడా ఉంటుంది.అలాంటి విషాధ సమయంలో కూడా ఈ ఇద్దరు హీరోలు ఆ బాధని దిగమింగుకొని మళ్ళీ షూటింగుకు హాజరు అయ్యారు.ఇవే సంఘటనలు త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ యొక్క మొదటి సినిమాకు కూడా యాదృచ్చికంగా జరిగాయి.దీనితో ఇలాంటి బాధాకరమైన యాదృచ్ఛికాలు వీరి ఇరువురికి త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఆశ్చర్యకరంగా జరిగాయని సోషల్ మీడియాలో తమ అభిమానులు తమ బాధను వెళ్లగక్కుకుంటున్నారు.