ప్రసంగంలో తడబడ్డ కలెక్టర్ ఆమ్రపాలి !

Saturday, January 27th, 2018, 03:09:44 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా హన్మకొండ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ మైదానం లో నిర్వహించిన సభా కార్యక్రమంలో చేసిన ప్రసంగం పలు విమర్శలకు తావిస్తోంది. జండావందనం తర్వాత తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆమె పలుసార్లు మధ్యలో తడపడ్డారు. ఆమె మాట్లాడిన వీడియో నిన్నటి నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రసంగం తెలుగులో రాసివుండడం వల్ల మధ్య మధ్యలో తడపడుతూ, ముఖ్యంగా మరుగుదొడ్లు నిర్మాణం గురించి మాట్లాడుతున్న సమయంలో ఆమె ఒక్కసారిగా ఇట్స్ ఫన్నీ అంటూ వెనక్కి తిరిగి చూసి నవ్వడం అందరికి కొంత ఆశ్చర్యంగా అనిపించింది. అలానే గణాంకాలు చదువుతున్న సమయంలో కూడా ఆమె ఆగి ఆగి నవ్వుతూ చదవసాగారు. గణతంత్ర దినోత్సవం రోజున ఒక ఐఏఎస్ స్థాయి అధికారి, అది కూడా ఆ జిల్లా కలెక్టర్ ప్రసంగం ఆ జిల్లా అభివృద్ధి ప్రణాళికకు అద్ధం పట్టేలా వుండాలేని కానీ ఇలా హాస్య చతురత తో కూడిన ప్రసంగం ఆమె చేయడం కొంతమందికి నవ్వులో పూయించినప్పటికీ మరికొందరు మాత్రం ఇలా చేయడం సబబు కాదని పెదవి విరుస్తున్నారు…