ఆవిర్భావ దినోత్సవం..రంగు రంగుల వెలుగుల్లో హైదరాబాద్

Saturday, June 2nd, 2018, 09:47:43 AM IST


తెలంగాణ రాష్ట్ర నాలుగవ ఆవిర్భావ దినోత్సవం వేడుకల కోసం హైదరాబాద్ మొత్తం కాంతులతో మెరుపులతో ముస్తాబైంది. ఈ రోజు ఘనంగా తెలంగాణ ప్రభుత్వం వేడుకలను ప్లాన్ చేసింది. అలాగే మరికొన్ని నగరాల్లో అలాగే గ్రామాల్లో కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ఆయా స్థానాల మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి వేడుకల బాధ్యతలను తీసుకున్నారు. ఇక హైదరాబాద్ లో అయితే తెలంగాణ సంస్కృతి కనిపించేలా వివిధ రకాలా ఆకృతులను ఏర్పాటు చేశారు.

మరికొన్ని చోట్ల కొన్ని ప్రదేశాలకు రంగు రంగుల బల్బులతో అలంకరణ చేయగా నడి రాత్రి భాగ్యనగరి వెలుగులతో విరజిమ్మింది. కొన్ని ప్రదేశాలు చాలా కొత్తగా అనిపించడంతో నగరవాసులు ఆకర్షితులై సెల్ఫీలు దిగారు. ఇక నేడు పెరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే భారీ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. అందుకోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను ప్యూ పూర్తి చేశారు. ఇక ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా తలెత్తకుండా ముందే జాగ్రత్తలు తీసుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments