దమ్ము, ధైర్యం ఉంటే బెజవాడ నడిబొడ్డులో తేల్చుకుందాం, చంద్రబాబు కు జోగి రమేష్ సవాల్

Tuesday, January 9th, 2018, 03:14:11 PM IST

వైఎస్ఆర్సిపి నేత జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమాలు టిడిపి సొంత కార్యక్రామాల లా తయారయ్యాయని, కేవలం తెలుగుదేశం ప్రభుత్వ కార్యకర్తలకు మరియు నాయకులకు చెందిన వారికే లబ్ది చేకూరుతోందని, ఇదేమిటీ అని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను మాట్లాడనివ్వకుండా అణగతొక్కుతున్నారని ఆయన విమర్శించారు. పోలీస్ లను అడ్డంపెట్టుకుని చంద్రబాబు జన్మభూమి కార్ర్యక్రామాలు నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్ముతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుంటే అదేదో తెలుగుదేశం పార్టీ సొంత సొమ్ముతో ఈ కార్యక్రామాలను నిర్వహిస్తున్నట్టు టిడిపి నాయకులు భ్రమల లో వున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలకు న్యాయం చేయమని గట్టిగా నిలదీసే అధికారం ప్రతిపక్ష నాయకులకు కార్యకర్తలకు ఉండదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న పార్థసారథి అరెస్ట్ చేయడం దుశ్చర్యగా ఆయన అభివర్ణించారు.

పార్థసారథి తో పాటు కోలవెన్ను గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ ను కూడా పోలీసులు అక్రమంగా నిర్బంధిచారని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చారని, ఆయన హయాంలో ప్రతిపక్ష నేతలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చేవారని, వైఎస్ఆర్ ప్రభుత్వం వున్నపుడు రేషన్ షాపుల్లో 9 రకాల సరుకులు ఇచ్చేవారని, కానీ ప్రస్తుతం చంద్రబాబు హయాంలో కేవలం బియ్యం తప్ప మరి ఏ ఇతర సరుకులు ఇవ్వడం లేదని ఆయన యెద్దేవా చేశారు. రైతు రుణాలను మాఫీ చేశామని చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్దాలు చెప్పుకుంటున్నారని, రుణ మాఫీ తోపాటు చాలా వరకు ద్వాక్రా గ్రూప్ లను నిర్వీర్యం చేసిన ఘనత ఆయనకీ, ఆయన ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన గట్టిగ విమర్శించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ నడిబొడ్డున తనతో బహిరంగ చర్చకు రావాలని, తమ మానిఫెస్టో లో పెట్టిన హామీలు వారు ఏ మేరకు నెరవేర్చారో చర్చలో పాల్గొని నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. ఏది ఏమైనా టిడిపి, వైఎస్ఆర్సిపి మధ్య మాటల పోరు, ఒక యుద్ధాన్ని తలపిస్తోంది.