రాబోయే ఎన్నికలు చంద్రబాబుకు చెంపపెట్టు కానున్నాయి : మోత్కుపల్లి

Wednesday, July 11th, 2018, 12:58:02 AM IST


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడిచిన నాలుగేళ్లలో కనీసం రాష్ట్రప్రజలు సంక్షేమం పట్టించుకోకుండా, త్వరలో ఎన్నికలు రానుండడంతో ఇప్పటికిపుడు కపట ప్రేమ చూపిస్తున్నారని టీటిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. చంద్రబాబు తన కుటిల రాజకీయాలకోసం ఎందరినో వంచించారని, దళితుడైన తనని గవర్నర్, మంత్రి తదితర పదవులు ఆశచూపి కొన్నేళ్లపాటు తన చుట్టూ తిప్పుకున్నారని మండిపడ్డారు. బాబు వ్యతిరేక శక్తులన్నీ కూడా కలిసి గట్టిగా ఆయనకు బుద్ధి చెప్పాలని అన్నారు. ఇక ఇప్పటికే ఏపీలో చాల వరకు పరువు పోగొట్టుకున్న బాబు ప్రభుత్వానికి రానున్న ఎన్నికలు పెద్ద చెంప పెట్టు కానున్నాయని ఆయన జోస్యం చెప్పారు. కాగా తెలంగాణాలో పార్టీ దుకాణాన్ని మూసేయడానికి సిద్ధంగా వున్న బాబు, ఏపీలో ఎవరు ఎంపీ, ఎమ్యెల్యే సీట్లకు ఎక్కువ డబ్బులిస్తే వారికీ కూరగాయల్లాగా సీట్లను పంచుతారని ఎద్దేవా చేశారు.

ఇప్పటికే బాబు వలలో గత ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పడి చాల వరకు తమ పేరుని కోల్పోయారని, చంద్రబాబు తన కొడుకుని ఇప్పుడు దొడ్డిదారిన మంత్రిని చేసారు, ఇక రానున్న మున్ముందు రోజుల్లో, ఒకవేళ టీడీపీ అధికారం చేపడితే రాష్ట్రానికి కొడుకునే ముఖ్యమంత్రిగా చేస్తారని అన్నారు. కావున రానున్న రోజుల్లో ఏపీ ప్రజలు టీడీపీని ఓడించాలని అన్నారు. రేపు తాను తిరుపతికి వెళ్తున్నాని, అలిపిరి నుండి కొండపైకి కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకోనున్నారు అయన తెలిపారు. అలానే 12వ తేదీ మధ్యాహ్నం ఏడుకొండలవాడి దర్శనమయ్యాక తిరుపతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తానని, అక్కడ తన కార్యాచరణ తెలియచేస్తాను అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments