అసలు జనసేన కవాతు గురించి జనానికి తెలుసా?

Sunday, October 14th, 2018, 11:46:02 AM IST

పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ మొదటిసారి పంతంతో చేస్తున్న చర్య జనసేన కవాతు. ఈ కవాతులో జనసేన భావజాలాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనేది పవన్ ఆలోచన. ఇందుకోసం గత పది రోజుల నుండి పవన్ జనసేన శ్రేణుల్ని, అభిమానుల్ని ముమ్మరంగా కదిలిస్తున్నారు. కవాతులో జనం జనసంద్రాన్ని తలపించేలా ఉండాలన్నది ఆయన లక్ష్యం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ క్యాంపైనింగ్ బాగానే చేస్తున్నారు.

అభిమానులు, కార్యకర్తలతో పాటు సామాన్య జనం కూడ పాల్గొంటేనే కవాతు విజయవంతమైనట్టు లెక్క. కానీ ఇక్కడ జనసేన రేపు చేయబోతున్న ఈ కవాతు గురించి సామాన్య ప్రజల్లో ఎంతమందికి తెలుసనేదే అసలు ప్రశ్న. ప్రముఖ టీవీ ఛానళ్లు ఎప్పుడో పవన్ ను పక్కనబెట్టేశాయి. పత్రికలైతే ఆయన ఎంత పెద్ద సంచలనం చేసినా దానికి సంబందించిన వార్తను ఏ మధ్య పేజీల్లోనో వెతుక్కోవాల్సినంత చిన్న సైజులో నామమాత్రంగా ముద్రిస్తున్నాయి. దీంతో ప్రధాన మాధ్యమాల్లో పవన్ మిస్ అయిపోయినట్టే.

ఇక స్వయంగా పవన్ కూడ ఈ విషయంపై ఇప్పటికీ అధికారిక ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలిసేలా మాట్లాడలేదు. ఇలా చాలా రకాల లోపల కారణంగా కామన్ పీపుల్లో కవాతుపై ఒక బలమైన ఐడియా అంటూ ఏర్పడలేదు. మరి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ను ఈ ఒక్క రోజు వ్యవధిలో జనసైనికులు అధిగమించి జనాలకు కవాతు గురించి విస్తృతంగా తెలిసేలా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.