పెట్రోలు ధరలు విషయంలో కేంద్ర ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సామాన్యులు..!

Wednesday, September 5th, 2018, 01:22:17 AM IST

ప్రస్తుతం గడుస్తున్న నవ యుగంలో ప్రతి ఒక్కరికి నిత్య అవసర సరుకులు అనేవి సర్వ సాధారణం. అయితే మన భారతదేశం లో అధిక శాతం మధ్యతరగతికి చెందిన వారు ఉన్నారు.. మనం ఎక్కడికి ఐన వెళ్లాలన్నా వారి వాహనాల్లో బయటకు వెళ్తున్నారు ఆలా వెళ్లాలి అంటే అందుకు దానికి సరిపడా ఇంధనం కావాలి.. ఆ ఇంధనం ఇప్పుడు వారికి అందుబాటు ధరలో ఉండటం లేదు అని సామాన్య ప్రజానీకం కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు.

అసలు ఎలాంటి ముందస్తు ప్రకటనలు కూడా ఇవ్వకుండా వారి ఇష్టానుసారం పెట్రోలు మరియు డీసెలు ధరలు పెంచుకుంటూ పోతున్నారు అని ఇలా అయితే మా లాంటి నెల జీతం మీద జీవనాన్ని సాగించే మాలాంటి సామాన్య ప్రజానీకం ఎలా బ్రతకాలని అడుగుతున్నారు. గడిచిన ఈ నాలుగు ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 15 నుంచి 20 రూపాయలు పెంచారు అని ఈ రెండు రోజుల్లోనే 25 పైసలు నుంచి ఒక రూపాయి వరకు పెంచేశారని వాపోతున్నారు. అప్పట్లో ఈ విషయం లో ప్రతిపక్ష నేతలు స్పందించేవారని ఇప్పుడున్న నేతలు అస్సలు స్పందించట్లేదు అని వారి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పెంచిన సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిపక్షము మరియు కేంద్ర ప్రభుత్వం తో మంతనాలు చేపట్టి తగు చర్యలు తీసుకోవాలి అని, అసలు ఈ పెట్రోలు మరియు డీసెలు మీద ఎందుకని “జి.ఎస్.టి” లేదని సామాన్యుల కష్టాలను అర్ధం చేసుకొని వారి మీద భారాన్ని తగ్గించాలని సగటు ప్రజలు కోరుకుంటున్నారు..

  •  
  •  
  •  
  •  

Comments