మీ టైమ్ పాస్ టూర్ వివరాలు ఎవరికి కావలి పవన్ !

Thursday, October 25th, 2018, 11:55:03 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీఎస్పీ నేతలతో సమావేశం కోసం నిన్న లక్నో వెళ్లిన సంగతి తెలిసిందే. సమావేశంతో రాష్ట్రంలోని దళితుల కోసం పవన్ ఏదో పెద్ద ముందగుడు వేయబోతున్నాడని అంతా అనుకున్నారు. రాష్ట్రంలోని దళిత సంఘాలన్నీ మూడో ప్రత్యున్మాయం అవుతానంటున్న పవన్ మాయావతి పార్టీతో ఏయే అంశాలు చర్చించి ఉంటారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఉంటారు, అవి భవిష్యత్తులో తమకేమైన మంచి చేస్తాయా అనే వివరాలు తెలుసుకోవాలని తెగ ఆసక్తి చూపారు.

కానీ పవన్, జనసేన అధికార వర్గాలు ఇప్పటి వరకు లక్నో పర్యటన వివరాల్ని బయటపెట్టలేదు. పవన్ నాయకులు ఎవరెవర్ని కలిశారు, ఏయే అంశాలపై చర్చలు జరిపారు వంటి వివరాలు తెలపకుండా పవన్ లక్నోలోని అంబేడ్కర్ మెమోరియల్ పార్కును కాలినడకన సందర్శించారు, అందులోని గ్యాలరీలను, మ్యూజియంను తిలకించి తన్మయత్వం చెందారు, మహాత్మ జ్యోతిరావ్ పూలే, డా.రాజేంద్రప్రసాద్ వంటి మహనీయుల విగ్రహాలను చూసి స్ఫూర్తి పొందారు అంటూ సందర్శించిన ప్రదేశాల లిస్ట్ చెప్పుకుంటూ పోయారు.

ఆఖరికి పవన్ కూడ తన ట్విట్టర్ ద్వారా జనానికి కావాల్సిన సమావేశ లక్ష్యాన్ని, ఫలితాన్ని చెప్పకుండా చూసిన విగ్రహాలు, చదివిన కొటేషన్ల ఫోటోలను షేర్ చేస్తూ ఎలా టైమ్ పాస్ చేసింది చెప్పుకొచ్చారు. ఇవన్నీ గమనించిన సామాన్య జనం ఇంతకీ పవన్ వెళ్ళింది టైమ్ పాస్ టూర్ కోసమా, పొలిటికల్ మీటింగ్ కోసమా అనుకుని ముక్కున వేలేసుకుంటున్నారు.