నిబంధనలను ఉల్లంఘించినందుకు భారత అథ్లెట్లపై వేటు

Friday, April 13th, 2018, 07:12:03 PM IST

కామన్వెల్త్‌ గేమ్స్‌ భారత అథ్లెట్లు వివిధ రంగాల్లో అద్భుతంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారని ఎన్నో వార్తలు వస్తోన్న సమయంలో నో నీడిల్స్‌’ పాలసీ నిబంధనలను భారత అథ్లెట్లు ఉల్లంఘించారనే వార్త అందరిని షాక్ కి గురి చేసింది. ప్రపంచ వ్యాప్తగా ఇప్పుడు ఆ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి అథ్లెట్లపై కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్(సీజీఎఫ్‌)‌ చర్యలు తీసుకుంది. గేమ్స్‌లో పాల్గొనకుండా సస్పెండ్‌ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. భారత అథ్లెట్లు రాకేశ్‌ బాబు, ఇర్ఫాన్‌ కోలోథమ్‌ గదులలో నీడిల్‌ దొరకడంతో నో నీడిల్స్‌‌’ పాలసీని ఉల్లంఘించారని గేమ్స్‌లో పాల్గొనకుండా సస్పెండ్‌ చేస్తున్నట్లు ఫెడరేషన్‌ తెలిపింది. అక్రిడిటేషన్‌ను కూడా రద్దు చేయడంతో పాటు క్రీడా గ్రామం నుంచి కూడా పంపి వేస్తూ.. వెంటనే వారిని స్వదేశానికి వెళ్లేలా చుడాలని కామన్వెల్త్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు సమాచారం అందించమని సీజీఎఫ్‌ అధ్యక్షుడు తెలిపాడు.