షాకింగ్ : పవన్ వల్లే జనసేన ఊపు తగ్గుతుందా…?

Saturday, March 16th, 2019, 12:15:28 AM IST

జనసేన పార్టీ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకునేందుకు ప్రచార కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోతుంది. కానీ పవన్ ప్రచారంలో మాత్రం ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ ని లక్ష్యంగా చేసుకొని ప్రచారాలు చేయడంతో ప్రజలు కాస్త అసహనానికి గురవుతున్నరుని అనిపిస్తుంది. కొద్దీ సందర్భాల్లో మాత్రమే పవన్ టీడీపీ అదినేత చంద్రబాబు ని టార్గెట్ చేశాడు. కానీ ఇప్పుడు పవన్ లక్ష్యం మాత్రం జగన్ మీదే ఉంది. ప్రతిదానికి జగన్ మీద ఏదో ఒక విధంగా నోరు పారేసుకోంది పవన్ కల్యాణ్ పొద్దు గడిచేలా లేదనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు ని మాట కూడా అనకుండా జగన్ ని విమర్శించడం వలన పవన్ మాత్రం చంద్రబాబు కి మడ్డ టూగా ఉన్నదేమో అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ప్రతీసారి ఇవే ప్రసంగాలు చెప్పడం వలన జనాలకి పవన్ ప్రసంగాలు సరిగా చేరడం లేదు. కాబట్టి ఇప్పటికైనా పవన్ తన పంతాన్ని మార్చుకొని ప్రచారాలు కొనసాగితే మంచిదని, లేదంటే ఓటమి తప్పదని పలువురు విశ్లేషకులు అంటున్నారు.