కరుణానిధి ఆరోగ్యంపై క్లారిటీ ఏది?

Monday, July 30th, 2018, 08:31:10 AM IST


తమిళ్ రాజకీయాల్లో సరికొత్త నాయకుడిగా ఎదిగిన డీఎంకే చీఫ్, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి(94) ఆరోగ్యం పై గత కొన్ని రోజులగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసలు ఆయన పరిస్థితి ఏమిటనే విషయంపై ఇంకా జనాలకు ఓ క్లారిటీ రాలేదు. మీడియాకి కూడా సరైన సమాచారం లేకపోవడంతో ఆరోగ్యం విషమంగా ఉందని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. దీంతో చెన్నై కావేరి హాస్పత్రికి జనాలు కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి చేరుతున్నారు.

విఐపిలు సీనియర్ రాజకీయ నాయకుల తో పాటు ఇతర పార్టీల అధినేతలు కరుణానిధిని పరామర్శించేందుకు వస్తుండడంతో అభిమానుల్లో కార్యకర్తల్లో అనుమానాలు మొదలవుతున్నాయి. అలాగే కరుణానిధి కుమారుడు స్టాలిన్ కూతురు కనిమొళి కూడా ఈ విషయంపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో హాస్పిటల్ ముందు నుంచి జనాలు వెళ్లడంలేదు. ఈ క్రమంలో రోజు పోలీసులకు జనాలకు మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. ఇక ఆదివారం రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసినప్పటికీ మళ్లీ తెల్లవారు జామున పరిస్థితి విషమించినట్లు పలు మిడియల్లో వార్తలు వెలువాడుతున్నాయి. కరుణానిధి ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వకుండా అన్నాడీఎంకే ప్రతినిధులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అనేది తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments