కేసీఆర్ దిష్టి బొమ్మను కాల్చిన కాంగ్రెస్ నేతలు..!

Saturday, September 8th, 2018, 12:23:14 PM IST

గడిచిన కొద్దీ రోజులుగా తెలంగాణా రాష్ట్రం లో రాజకీయ పార్టీల మధ్య రాజకీయ పరమైన విమర్శలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ రద్దు చేసిన అనంతరం పెట్టిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పైన చేసిన వ్యాఖ్యలకి తెరాస కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అక్కడి కాంగ్రెస్ నాయకులు కెసిఆర్ యొక్క దిష్టి బొమ్మను తగులబెట్టారు. సోనియా గాంధీ హయం లో ఇచ్చిన తెలంగాణా ని అప్పుల పాలు చేసి, ఏం సాధిస్తున్నారో తెలియజేయాలని అంటున్నారు. అక్కడి నేతలు మాట్లాడుతూ కెసిఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు అని, ఆ అహంకారమే మీ పతనానికి దారి తీస్తున్నది అని సూచించారు. ఇంకా తెలంగాణా ఇవ్వక ముందు కెసిఆర్ సోనియా వద్ద అణిగి మణిగి ఉండేవారని, తెలంగాణా ఇస్తే మన దళితులను ముఖ్యమంతిని చేస్తా అని టక్కరి మాటలు చెప్పి అధికారం చేజిక్కించుకొని, దళితులను బడుగు బలహీన వర్గాల వారిని మర్చిపోయారు అని తీవ్ర విమర్శలు చేశారు..

  •  
  •  
  •  
  •  

Comments