జగ్గారెడ్డిపై 8 కేసులు.. చంచల్ గూడ జైలుకు తరలింపు!

Tuesday, September 11th, 2018, 04:36:49 PM IST

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మానవ అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే 2004లో నకిలీ పాస్ పోర్టులు పత్రాలను క్రియేట్ చేయడం వలన జైగ్గారెడ్డిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇక 3 గంటలు పాటు జగ్గారెడ్డిని విచారించిన అనంతరం సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు తీర్పుతో జగ్గారెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. గుజరాత్ కి చెందిన ముగ్గురు వ్యక్తులను తన కుటుంబ సబ్యులని అమెరికాకి పంపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. జగ్గారెడ్డి అరెస్టుతో తెలంగాణ రాజకీయా వివాదాలు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనను కావాలనే రాజకీయంగా ఇరికించారని జగ్గారెడ్డి ఆరోపించారు. అదే విధంగా సంగారెడ్డిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నానని ఆ సభ ఫెయిల్ అవ్వాలని కుట్ర పన్నారని కేసీఆర్ పై జగ్గారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments