మాజీ రాష్ట్రపతిని కనీసం పిలవలేదే.. మరి అంత లోకువయ్యారా?

Tuesday, June 12th, 2018, 11:14:17 AM IST

దేశంలో అందరి ద్రుష్టి ఇప్పుడు కూటముల వైపే మళ్లింది. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచినా కూడా రాజకీయ పరంగా కూటమిని బలంగా చేసుకున్న వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే దేశం మొత్తంలో కాంగ్రెస్ ఇప్పుడు బలంగా లేదు. బారత జనతా పార్టీ కూడా తన మద్దతును చేతులారా పోగొట్టుకుంటోంది. దీంతో థర్డ్ ఫ్రంట్ అనే విషయం గత కొంత కాలంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కేసీఆర్ పావులు కదిపినా కర్ణాటక ఎలక్షన్ తో రివర్స్ అయ్యింది.

అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం ముందు నుంచి అందుకు సంబందించిన కార్యాచరణ మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆయనకు ప్రధాని అవ్వాలని కోరిక ఉంది. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అందుకే బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చెయ్యాలని అనుకున్నారు. బీజేపీ సన్నిహిత పార్టీలతో ఆయన మంతనాలు జరపడం ఒక దశలో అందరిని ఆశ్చర్యపరిచింది. ఆరెస్సెస్ తో కూడా ప్రణబ్ చేతులు కలిపారని అందరిని షాక్ కి గురి చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రణబ్ ను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

ఎందుకంటే కాంగ్రెస్ ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే ఇప్తార్ విందుకు ప్రణబ్ ను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ వ్యతిరేక పార్టీలను రాహుల్ ముందు నుంచి ఏకం చేస్తున్నారు. 13న ఢిల్లీ తాజ్ హోటల్ లో జరిగే ఇఫ్తార్ విందుకు ప్రముఖ రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందాయి. కానీ ప్రణబ్ కు మాత్రం ఇన్విటేషన్ అందలేదు. కాంగ్రెస్ ఆలోచనలకూ అనుగుణంగా కాకుండా ప్రణబ్ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఆ పార్టీ అధిష్టానం దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments