ఏపిలో ప్రతిపక్షం – తెలంగాణాలో అధికారం.. కాంగ్రెస్ కసరత్తులు!

Wednesday, July 11th, 2018, 09:16:29 AM IST

దేశ రాజకీయాల్లో ఎన్నో ఘన విజయాలను అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేని విధంగా తన బలాన్ని గత ఎలక్షన్స్ లో పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో తన అధికారాన్ని కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు మోడీపై వస్తున్న విమర్శల వల్ల మరికొన్ని స్థానాలను తన వశం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం దొరికింది. అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రణాళికలు రచించారు.

అయితే కాంగ్రెస్ పార్టీకి దాదాపు సగం రాష్ట్రాల్లో ఎంతో కొంత బలం ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పూర్తిగా క్షిణించిపోయింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణాలో గెలుస్తుంది అనుకున్నప్పటికీ టీఆరెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం వల్లనే వచ్చింది అనే విషయాన్ని ఆ పార్టీ నేతలు జనాల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కంచుకోటలాంటి స్థానాలను సైతం కాంగ్రెస్ చేజార్చుకుంది. ఇకపోతే ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టింది.

ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇప్పటికి పార్టీ కోలుకునేలా లేదు. సీనియర్ నాయకులూ మొత్తం వైఎస్సార్ పార్టీ – టీడీపీ లో చేతులు కలిపారు. త్వరలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇరురాష్ట్రాల నేతలతో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే తెలంగాణాలో నేతల మధ్య ఐక్యత లేకపోవడంపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సర్వేల ఆధారంగా పార్టీ టిక్కెట్టు ఇవ్వలని సూచించగా సీనియర్ నాయకలు అలుగుతున్నారు. అంతే కాకుండా పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష స్థాయిలో పార్టీని నిలబెట్టి తెలంగాణాలో అధికారంలో ఉంచాలని రాహుల్ వ్యూహ రచనలు చేస్తున్నాడు. మరి ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments