కాంగ్రెస్ తక్షణ కర్తవ్యం..ఈసారైనా వర్కౌట్ అవుతుందా?

Sunday, May 20th, 2018, 10:02:55 AM IST

అసెంబ్లీలో ఈ రోజు యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేయడం అందరికి షాక్ ఇచ్చింది. ముందుగా తన బలాన్ని చూపించుకుంటానని చెప్పిన ఆయన అసెంబ్లీ సమావేశంలో మాత్రం కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ వెళ్లిపోయారు. అయితే ఈ విషయంపై ఇప్పుడు కాంగ్రెస్ నేతలు వినూత్న తరహాలో వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఎలక్షన్స్ తరువాత పెద్దగా స్పందించని రాహుల్ గాంధీ యడ్యూరప్ప పదవీవిరమణ చేయగానే ప్రజాస్వామ్యం గెలిచింది అంటూ.. కౌంటర్లు ఇచ్చారు. అదే విధంగా ఏమి చేయలేక పారిపోయారని ఎద్దేవా చేయడం వైరల్ అయ్యింది.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య కూడా అదే స్టైల్ లో బీజేపీ నేతలకు చురకలంటించారు. బీజేపీ ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా ప్రజాస్వామ్యమే చివరికి విజయం అందుకుందని బలాన్ని నిరూపించుకుంటానని చెప్పిన యడ్యూరప్ప అసమర్దుడిగా పరారయ్యాడని కామెంట్ చేశారు. మొన్న గవర్నర్ చేసిన విధానం కూడా చాలా తప్పని చెప్పిన ఆయన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బిజెపిపై మండిపడ్డారు. ఈ విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు బీజేపీ లోపాలను దేశం ముందు పెట్టాలని చూస్తోంది. అధికారం దక్కించుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు అన్నట్టుగా అందరికి తెలిసేలా చెయ్యాలని చూస్తున్నారు. ప్రస్తుతం నేతలందరూ ఇదొక్కటే టార్గెట్ గా పెట్టుకొని వచ్చే ఎలక్షన్స్ పై కూడా ప్రభావం చూపేలా ప్లాన్ వేస్తున్నారు. అయితే బిజెపిపై ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ మళ్లీ ఎప్పటికప్పుడు తన ఎన్నికలు రాగానే తన ప్లాన్స్ తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. మరి కాంగ్రెస్ నెక్స్ట్ స్టెప్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments