బ్రేకింగ్‌ : కాంగ్రెస్‌కు రెండు, కారుకు రెండు!

Friday, December 7th, 2018, 11:30:30 AM IST

పోలింగ్ స‌ర‌ళి గ‌త ఎన్నిక‌ల కంటే ఈసారి మ‌రింత మెరుగ్గా సాగుతోంది. జ‌నం ఇళ్ల‌లోంచి బ‌య‌టికి వ‌చ్చి ఓట్లు వేసేందుకు ఆస‌క్తిగా ఉన్నారు. ఇక‌పోతే ఇప్ప‌టికే ఖ‌మ్మం జిల్లాలో మ‌హాకూట‌మి గాలి వీస్తోంద‌న్న స‌మాచారం అందింది. తేరాస కొన్నిచోట్ల మెరుగైన రిజల్టునే అందుకుంటున్నా మెజారిటీ కూట‌మికి ఉంటుంద‌ట‌.

ఇక హుజూర్ నగర్, కోదాడల్లో కాంగ్రెస్ హవా సాగుతోంది. మహబూబాబాద్, డోర్నకల్ లో కారు గాలి జోరుగా ఉంద‌ట‌. మొత్తానికి తెలంగాణ ఫలితాలు 50-50గా క‌నిపించే ఛాన్సుంద‌ని ఫ‌లితాల‌పై ఊహాగానాలు సాగుతున్నాయి. ఎవ‌రి గాలి చివ‌రికి ఎటు వీచేనో ఫ‌లితాల రోజు 11వ‌ర‌కూ వేచి చూడాలి.