ఏపిలో రాహుల్ భారీ భహిరంగ సభ!

Tuesday, September 4th, 2018, 03:54:10 PM IST

తెలుగు ప్రజలకు ఒకప్పుడు ఎంతో దగ్గరైన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రాష్ట్ర విభజన తరువాత పార్టీ చాలా వరకు నష్టపోయింది. వైఎస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణాలో ఆ పార్టీకి ఇప్పటికైనా బలం ఉంది. కరెక్ట్ గా ప్రణాలికలతో ముందుకు వెళితే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే వారు లేకపోలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లోనే పార్టీ పరిస్థితి దారుణంగా తయారయ్యింది.

సీనియర్ నేతలు అందరూ కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడంతో పార్టీ బలహీనపడింది. అయితే అధిష్టానం మాత్రం పార్టీని బలోపేతం చేయడానికి ఇంకా కష్టపడుతూనే ఉంది. ఏపీసీసీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి పార్టీ క్యాడర్ ను పెంచుకుంటూ వెళుతున్నారు. అదే విధంగా రాష్ట్ర విభజన అనంతరం పార్టీ నుంచి వీడిన నాయకులూ కూడా తీరిగి పార్టీలోకి రావడంతో కొత్త కళ ఏర్పడింది. ఇక పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫైనల్ గా ఈనెల 18న కర్నూల్‌ కు రాహుల్ గాంధీ రావడానికి సిద్దమయ్యాడు. చాలా రోజుల తరువాత భారీ బహిరంగ సభను కాంగ్రెస్ నాయకులూ నిర్వహించనున్నారు.

కార్యకర్తలతో ముందుగా సమావేశం నిర్వహించలని ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, కేర‌ళ మాజీ సీఎం ఊమెన్‌చాందీ, ఏపీసీసీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్‌. ర‌ఘువీరారెడ్డి డిసైడ్ అయ్యారు. అందుకోసం రాహుల్ కర్నూలుకు వచ్చే రెండు రోజుల ముందే వారు చర్చలు జరపనున్నారు. రాహుల్ వచ్చిన తరువాత పాల్గొనాల్సిన కార్యక్రమాలతో పాటు కొంత మంది విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడాలని అనుకుంటున్నారట. అదే విధంగా కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో రాహుల్ భారీ బహిరంగ సభ కోసం కాంగ్రెస్ నాయకులు సమావేశంలో చర్చించనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments