కాంగ్రెస్ సమస్య ఏంటి? ఉత్తమంగా వెళ్ళకుండా ఉత్తి మాటలు!

Thursday, September 28th, 2017, 09:14:22 AM IST

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు మరిచి పోయి మూడు సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రాలో అయితే పూర్తిగా పాడి కట్టేశారు. అక్కడ మరల తేరుకొని పైకి రావాలంటే వైఎస్సార్ లా ఎవడో ఒక నాయకుడు పుట్టుకురావాలి. లేదంటే కాంగ్రెస్ పుట్టే ఏపీలో తేలే అవకాశం అయితే ఇప్పట్లో లేనట్లే. అయితే తెలంగాణాలో మాత్రం కొద్దో గొప్పో గాయాలతో ఐసియూ ఉన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. అదేదో పాత సామెత ఒకటి ఉన్నట్లు నాయకుడుకి లేనిదీ బంట్రోతుకి ఏంటి అని. అంతే కదా. ఇప్పుడు కేంద్రంలో అధినాయకత్వం చేసిన పని తప్పని అర్ధమై చాడీ చప్పుడు చేయకుండా ఉంది.

అయితే తెలంగాణాలో ఉండే నాయకులు ఇప్పటికే అధికారం అనే ఇల్యూజన్ లో ఉన్నట్లు ఉన్నారు. మెట్రో మేము తీసుకొచ్చాం, తెలంగాణని మా పార్టీ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తాం వచ్చాక టీఆర్ఎస్ అవినీతి బట్టబయలు చేస్తాం అంటూ బీరాలు పలుకుతున్నారు. తెలంగాణని కాంగ్రెస్ అన్ని విధాల అభివృద్ధి చేస్తే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మెట్రో పనుల్లో జాప్యం, పథకాల్లో అవినీతి అంటూ మాట్లాడుతూ హడావిడి చేస్తున్నారు.

అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చూసుకుంటే ప్రతి ఒక్కరు తమకి తాము ముఖ్యమంత్రి అయిపోవాలని ఆశతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. పీసీసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ సారి ముఖ్యమంత్రి అంటాడు, జానారెడ్డి తాను ముఖ్యమంత్రి అంటాడు. మిగిలిన వాళ్ళు కూడా మంత్రి పదవులని అప్పుడే పంచేసుకుంటారు. పోనీ ఈ మూడేళ్ళ కాలంలో అధికార పార్టీ మీద ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ చేసిన పోరాటం ఎంటా అంటే దిక్కులు చూసే పరిస్థితి కనిపిస్తుంది. కనీసం పార్టీని సమర్దవంతంగా నడిపించే నాయకత్వం లేకుండా ఎ విధంగా అధికారంలో వస్తారు అనేది ఆ పార్టీ నాయకులకె తెలియాలి.

  •  
  •  
  •  
  •  

Comments