టీఆరెస్ కు షాక్ ఇచ్చిన హైకోర్ట్..

Tuesday, June 5th, 2018, 03:45:46 AM IST

ఈ ఏడాది మొదట్లో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు కాంగ్రెస్ నేతల గొడవల వల్ల అసెంబ్లీ నుంచి వారు బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి హెడ్‌ ఫోన్ విసరగా అది మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కు తగిలింది. అప్పట్లో సంచలన సృష్టించిన ఈ ఘటన అందరికి తెలిసిందే. అనంతరం కోమటిరెడ్డి – సంపత్‌ కుమార్‌ ల సభ్యత్వాలను అసెంబ్లీ రద్దు చేసింది.

దీంతో కాంగ్రెస్ నేతలు టీఆరెస్ నేతలకు వ్యతిరేకంగా హై కోర్టుకి వెళ్లారు. దీంతో ఇటీవల కోర్టు లో విచారణ జరుగగా వారికి మద్దతుగా తీర్పు వచ్చింది. అది ఎంత మాత్రం చెల్లదని కొట్టేయడంతో కాంగ్రెస్ నేతల్లో సంబరాలు మొదలయ్యాయి. టీఆరెస్ కు ఇది భారీ దెబ్బ అని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నేత కోమటిరెడ్డి టీఆరెస్ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. న్యాయ వ్యవస్థతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెలగాటమాడుతున్నారని కోర్టు ధిక్కార నోటీస్ ఇస్తామని తెలిపారు. అలాగే రాజీనామాల గురించి నేతలతో చర్చినట్లు చెబుతూ.. త్వరలో ఒక నిర్ణయానికి రానున్నట్లు చెప్పారు.

  •  
  •  
  •  
  •  

Comments