2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ – జేడీఎస్!

Saturday, June 2nd, 2018, 01:49:36 AM IST

ప్రస్తుతం నేషనల్ పార్టీలు వీక్ గా ఉన్న ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడానికి చాలా కష్టపడుతున్నాయి. అవసరం అయితే స్థానిక పార్టీలను కలుపుకొని కూటములను ఏర్పాటు చేసుకుంటున్నాయి. గత ఏడాది భారత జనతా పార్టీ ఆ రూట్ లో వెళ్లి అధికారాన్ని అందుకున్నట్టే ఈ సారి కాంగ్రెస్ కూడా అదే తరహాలో వెళ్లాలని చూస్తోంది. రీసెంట్ గా కర్ణాటక ఎలక్షన్స్ అందుకు ఉదాహరణంగా చెప్పుకోవచ్చు. ఎక్కువ సీట్లు గెలిచినప్పటికీ స్థానిక పార్టీ జనతా దళ్ సెక్యులర్ లకు అధికార పీఠాన్ని అందించింది.

ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయడంతో ఆ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ పై నమ్మకాన్ని పెంచుకుంటోంది. అదే తరహాలో వీక్ గా ఉన్న రాష్ట్రాల్లో స్థానిక మద్దతుదారులను ముందు ఉంచి గెలవాలని చూస్తోంది. ఇకపోతే కర్ణాటక లో ప్రభుత్వాన్ని ఏర్పడు చేసే క్రమంలో జేడీఎస్ – కాంగ్రెస్ లకు విభేదాలు వస్తాయని తొందరగానే విడిపోవచ్చని కామెంట్స్ వచ్చాయి. అయితే కామెంట్స్ కు ఇరు పార్టీలు గట్టి సమాధానాన్ని ఇచ్చాయి. వచ్చే 2013 లోక్ సభ ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేస్తున్నట్లు జేడీఎస్ నేత తెలిపారు. అలాగే కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్‌ కూడా శుక్రవారం ప్రకటన చేశారు. ఇప్పటికే కేబినెట్ విస్తరణలో ఒక నిర్ణయానికి వచ్చిన నాయకులూ 6వ తేదీన కేబినెట్ ను విస్తరించనున్నట్లు చెప్పారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో ఉమ్మడి కమిటీని నిర్వహించి ప్రతి నెల భేటీ అయ్యేటట్లు నిర్ణయం తీసుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments