ఆ పదవిపై కాంగ్రెస్, జెడిఎస్ మధ్య కుదరని ఏకాభిప్రాయం?

Tuesday, May 22nd, 2018, 10:54:05 AM IST

ఎట్టకేలకు సుప్రీమ్ జోక్యంతో కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. ఓవైపు జేడీఎస్ అధినేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే మిగతా పదవుల పంపకం విషయంలో చర్చలకు ఆయన నిన్న ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా, అలానే అధ్యక్షులు రాహుల్ తో చర్చలు జరిపిన పిదప స్పీకర్ పదవిని కాంగ్రెస్ కి ఇవ్వటానికి ఒప్పుకున్నారని, అలానే కాంగ్రెస్ రెండు డిప్యూటీ సీఎం పదవులు కోరుతోందని, అందులో ఒకటి లింగాయత్ వర్గానికి కాగా, మరొకటి దళితులకు ఇవ్వాలని భావిస్తున్నారట. అయితే కుమారస్వామి మాత్రం దానికి ఒప్పుకోవడం లేదని, అందుకోసం నేటి సాయంత్రం వరకు ఆయన గడువు కోరినట్లు సమాచారం.

ఇక ఆర్ధిక, పంచాయితీరాజ్ శాఖలను తన వద్దనే ఉంచుకున్న కుమారస్వామి , కాంగ్రెస్ కు హోమ్ శాఖను కేటాయిన్చనున్నట్లు తెలుస్తోంది. పోతే ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన 24గంటల లోపు అభ్యర్థుల బలనిరూపణ ఉంటుందని, అప్పటివరకు జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్యెల్యేలు అందరూ కూడా హోటల్ లోనే ఉంటారని కుమారస్వామి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక 12 సంవత్సరాల తరువాత రేపు సాయంత్రం ఎంతో ఘనంగా జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా యుపి సమాజ్ వాది పార్టీ ప్రెసిడెంట్ అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, మాయావతి తదితరులు పాల్గొంటారని తెలుస్తోంది……

  •  
  •  
  •  
  •  

Comments