జేడీఎస్ – కాంగ్రెస్ నేతల హోటల్ ఖర్చు ఎంతో తెలుసా?

Saturday, May 19th, 2018, 10:06:08 AM IST

కర్ణాటక రాజకీయాలు రోజు రోజుకి ఊహకందని రీతిలో మారుతున్నాయి. మద్దతు కొరకు ఇప్పుడు అన్ని పార్టీలు చేస్తున్నా వ్యూహ రచనలు అన్ని ఇ న్ని కావు. ముఖ్యంగా భారత జనతా పార్టీకి బయపడి జేడీఎస్ – కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇరు పార్టీల నుంచి గెలిచినా ఎమ్మెల్యేలను పార్టీ వారు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఎక్కడ తమ నేతలను బీజేపీ లాగేసుకుంటుందో అని వారికి తెలియకుండా అసెంబ్లీలో బలనిరూపణ వరకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

జేడీఎస్ – కాంగ్రెస్ వారి నేతల కోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే అందరు షాక్ అవుతారు. ఇటీవల నోవాటెల్‌లో జేడీఎస్, తాజ్‌కృష్ణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేశారు. కేవలం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నందుకు కాంగ్రెస్ నేతలకు 26 లక్షలు బిల్లు అయ్యిందట. ఇక అదే తరహాలో జేడీఎస్ నేతలకు 19 లక్షల వరకు ఖర్చయ్యిందట. ఈ ఖర్చులను పార్టీ అధిష్టానమే భరించింది. ఇక జేడీఎస్ నేతల్లో ఇద్దరు మిస్ అయినట్లు వార్తలు వచ్చాయి. నేడు బలపరీక్షలో నాయకుల నిర్ణయాన్ని బట్టి కర్ణాటక ప్రభుత్వంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments