సీఎం సీటు ఇచ్చి.. మంత్రి పదవులను లాగేసుకున్న కాంగ్రెస్ ?

Wednesday, May 23rd, 2018, 01:00:29 AM IST

కర్ణాటకలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ – కేడీఎస్ పార్టీలు సిద్ధమయ్యాయి. పూర్తి ప్రణాళికలతో రేపు ముఖ్యమంత్రి పదవికి జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ పొత్తులో ఎన్నో సమస్యలు వస్తాయని ముందు ముందు తెలుస్తుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఇటీవల కొన్నికామెంట్స్ చేశారు. అయితే కాంగ్రెస్ – జేడీఎస్ లు ముందుగానే కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. ముఖ్యంగా మంత్రి పదవుల విషయంలో ఎలాంటి వివాదాలు తెలెత్తకుండా ప్లాన్స్ వేసుకున్నారు.

ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో గాని ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో 34 మంత్రి పదవులు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ 22 పదవులను అందుకోగా జేడీఎస్ 12 పదవులతో సరిపెట్టుకోనుంది. డిప్యూటీ సీఎంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక స్పీకర్ విషయంలో కాంగ్రెస్ స్పీకర్ ను అందుకోగా డిప్యూటీ స్పీకర్ పదవిని జేడీఎస్ కు దక్కింది. మొత్తానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి మంత్రి పదువులు విషయంలో జేడీఎస్ కు ఛాన్స్ ఇవ్వడంలేదనే టాక్ వస్తోంది. మొత్తంగా ఆ పార్టీ అనుకూలమైన మంత్రి పదవులను ఎపిక చేసుకున్నట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments